అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల ప్రభావం కారణంగా దేశీయంగా కూడా ధరలు దిగొచ్చాయి. వరుసగా మూడోసారి గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. వెండి ధర కూడా దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో 1906 డాలర్ల వద్ద కొనసాగిన ఔన్సు స్పాట్ గోల్డ్.. నిన్న రాత్రి 1910 డాలర్లకు చేరుకొని మళ్ళీ 1906 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం అంటే ఇవాళ ఉదయం 7:35 గంటలకు 1908 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రతికూలంగానే సాగుతోంది. ఇక దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,050 వద్ద కొనసాగగా ఇవాళ రూ. 200 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 53,850 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 58,960 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 210 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 58,750 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధర కూడా పసిడి బాటలోనే తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఉదయం ఔన్సు స్పాట్ వెండి 22.73 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ 22.58 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయంగా వెండి ధర దిగొచ్చింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 75,700 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 400 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 75,300 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది.