నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో ఇవాళ దేశీయ మార్కెట్లో కూడా ఈ ధరలు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకి బ్రేక్ వేయడంతో డాలర్ కి బ్రేక్ పడింది. దీంతో బంగారం పుంజుకుంది. మొన్న ఉదయం 7:30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1933 డాలర్లు ఉండగా నిన్న మార్కెట్ ముగిసే సమయానికి ఏకంగా 24 డాలర్లు పెరిగింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1958 డాలర్లకు చేరుకుంది. మరోసారి బంగారం పుంజుకునే ప్రయత్నం చేసింది. ఈ కారణంగా దేశీయంగా కూడా పసిడి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న ఉదయం రూ. 54,700 ఉండగా.. ఇవాళ రూ. 400 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 59,670 ఉండగా ఇవాళ రూ. 440 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతం రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.
బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. నిన్న ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి 23.92 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ 24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో దేశీయంగా కూడా వెండి ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 78,500 వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి రూ. 77,500 ఉండగా ఇవాళ రూ. 1000 పెరిగింది. మరి బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందా? లేదా? అంటే బంగారం ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం (ఉదయం 7:30 గంటలకు) ఔన్సు స్పాట్ గోల్డ్ 1957.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్నటి మీద ఒక డాలర్ తగ్గింది. కాబట్టి బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. వెండి ధర అయితే స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. కాబట్టి కొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.