పసిడి ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. మరి దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1961 డాలర్లు ఉండగా ఇవాళ ఉదయం 1956 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 5 డాలర్ల మేర పడిపోయింది. ఇక స్పాట్ వెండి కూడా ఇదే తరహాలో పడిపోయింది. ప్రస్తుతం స్పాట్ వెండి ఒక ఔన్సుకి 24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 07.30 నిమిషాలకు 28 గ్రాముల స్పాట్ గోల్డ్ మన కరెన్సీ ప్రకారం విదేశీ మార్కెట్లో రూ. 1,61,379 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,500 ఉండగా ఇవాళ కూడా అంతే ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 60,550 ఉండగా ఇవాళ కూడా అలానే ఉంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 79,800 వద్ద కొనసాగుతోంది. నిన్న కూడా ఇదే ధర ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర కాస్త తగ్గింది. మన కరెన్సీ ప్రకారం విదేశీ మార్కెట్లో ప్రస్తుతం 07:32 నిమిషాలకు కిలో వెండి రూ. 63,971.87 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ ధర తక్కువే. అలానే స్పాట్ గోల్డ్ కూడా తగ్గింది. కావున ఈరోజు స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు రేపు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కొనడం కంటే తగ్గినప్పుడు కొనడం ఉత్తమం.