నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ప్రతికూలంగా సాగిన స్పాట్ గోల్డ్ ఇవాళ మళ్ళీ ఊపందుకుంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర సానుకూలంగా కొనసాగుతోంది. నిన్న ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1910 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ 15 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అనగా 7:22 గంటలకు విదేశీ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1925.89 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,250 ఉండగా ఇవాళ రూ. 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,150 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 59,160 ఉండగా ఇవాళ రూ. 90 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 59,070 వద్ద కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి వంటి ఏరియాల్లో హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్సు స్పాట్ వెండి 23.15 డాలర్ల వద్ద ఉండగా.. ఇవాళ ఉదయం 7:26 గంటలకు 23.09 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్నటి మీద ఇవాళ స్వల్పంగా తగ్గింది. కానీ సానుకూలంగా ట్రేడ్ అవుతోంది. దేశీయంగా చూసుకుంటే మాత్రం వెండి భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి నిన్న రూ. 76,700 ఉండగా ఇవాళ రూ. 1000 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి 75,700 వద్ద కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి దేశీయంగా ఈ ధరలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇవాళ బంగార, వెండి కొనడం మంచిది.