గోల్డ్ రేటు గత నెల వరకు గరిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆషాఢం స్టార్ట్ అయిన తర్వాత బంగారం ధర పడిపోతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అతివలకు బంగారం అన్న చాలా మక్కువ. ప్రతి మహిళ తనకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత పక్కకు తీసి బంగారం పోగు చేసుకుంటారు. బంగారాన్నిలక్ష్మీదేవితో పోలుస్తారు. లక్ష్మీదేవి పండుగలైన వరలక్ష్మీ వ్రతం, దీపావళి పండుగనాడు ధనలక్ష్మీ పూజకు ప్రతి ఇంట్లో బంగారం కొని పూజలో ఉంచుతారు. అమ్మవారికి బంగారం అన్న చాలా ప్రీతి. బంగారం ఉన్న దగ్గర లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని నమ్మకం. బంగారం ధరించడం ద్వారా సమాజంలో మంచి స్టేటస్‌ను గుర్తింపజేస్తుంది. ఇక అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరల్ని నిర్ణయిస్తాయన్న విషయం తెలిసిందే. కామన్‌గా ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు యూఎస్ డాలర్ సహా బాండ్ ఈల్డ్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.
అక్కడ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ కూడా వీటిపై పెట్టుబడులకు మొగ్గుచూపుతారు. దీంతో బంగారం ధర పడిపోతుంది. ఇది గోల్డ్ కొనుగోలుదారులకు శుభవార్త అని చెప్పవచ్చు. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్‌కు 1916 డాలర్ల వద్ద కొనసాగగా.. స్పాట్ వెండి ధర చూస్తే 23.15 డాలర్లు ట్రేడవుతుంది. డాలర్ తో పోల్చి చూస్తే ప్రస్తుతం రూపాయి విలువ పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూ. 82.42 వద్ద ఉంది. గత కొద్ది రోజులుగా తగ్గిన బంగారం ధలు హైదరాబాద్‌లో ఇవాళ స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,060 వద్ద కొనసాగుతుంది.
ఇకపోతే ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు నికలడగానే ఉన్నాయని చెప్పవచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,220 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు చూస్తే.. ఢిల్లీ మార్కెట్లో తాజాగా పెరిగాయని చెప్పాలి. కిలోపై రూ. 500 పెరిగింది. ప్రస్తుతం రూ. 72,200 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేటు రూ. 75,800 వద్ద ట్రేడవుతుంది.