అంతర్జాతీయంగా పడిపోతూ వచ్చిన బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర సానుకూలంగా సాగుతోంది. ఇక వెండి కూడా పసిడి బాటలోనే నడుస్తుంది. దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతూ వచ్చిన స్పాట్ గోల్డ్ మళ్ళీ పుంజుకుంటుంది. మే నెలలో 2050 డాలర్ల మార్కును టచ్ చేసిన గోల్డ్ ఆ తర్వాత క్షీణిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే 128 డాలర్ల మేర పడిపోయింది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ ఔన్సు గోల్డ్ ధర 1922.15 డాలర్ల వద్ద ఉండగా.. ఇవాళ ఉదయం 7:15 గంటలకు 1925.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం సానుకూల ధర వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్లో అయితే గోల్డ్ ధరలు పెరిగాయి. నిన్న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ. 54,050 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 100 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,150 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 58,960 ఉండగా ఇవాళ రూ. 100 పెరిగింది.
దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 59,060 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలంగా సాగుతోంది. నిన్న ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి 22.94 డాలర్ల వద్ద ఉండగా.. ఇవాళ ఉదయం 22.95 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో వెండి ధర పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 75,500 వద్ద ఉండగా ఇవాళ రూ. 300 పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 75,800 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సానుకూలంగా సాగుతున్నాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పెరగక ముందే కొనుగోలు చేస్తే కొంత వరకూ డబ్బు ఆదా అవుతుంది.