అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ క్రమంగా పెరుగుతుంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
రెండు రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, స్పాట్ వెండి ధరల విషయంలో ప్రతికూలత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం పడింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అయితే నిన్న ఉదయం గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1960 డాలర్లు ఉన్న స్పాట్ గోల్డ్ ఇవాళ ఉదయం మాత్రం మరోసారి పుంజుకుంటోంది. దీంతో దేశీయంగా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే మొన్నటికి, నిన్నటికి స్పాట్ గోల్డ్ ధరలో పెద్దగా పెరుగుదల, తగ్గుదల కనిపించకపోవడంతో ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,160 వద్ద ఉండగా ఇవాళ కూడా అదే ధర కొనసాగుతుంది.
నిన్న హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150 ఉండగా ఇవాళ కూడా అదే ధర కొనసాగుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర సానుకూలంగా సాగుతున్న కారణంగా దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండవచ్చు లేదా పెరగవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్ 1962.57 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న స్పాట్ వెండి 24.67 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ ఉదయం 24.48 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80,500 ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 80,500 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర విషయంలో ప్రతికూలత నెలకొన్న నేపథ్యంలో ఈ ధర స్థిరంగా ఉండవచ్చు లేదా మరింత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. బంగారం కొనాలనుకునేవారు ఈరోజు కొనుక్కోవడం మంచిదే లేదంటే మళ్ళీ తగ్గే వరకూ ఆగాల్సిందే. ఇక వెండి కొనాలనుకునేవారు తగ్గే వరకూ ఆగడం ఉత్తమం.