అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర పతనమవుతూ వస్తుంది. ఈ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
వారం క్రితం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బంగారం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజుల నుంచి స్పాట్ గోల్డ్ పతనమవుతూ వస్తుంది. ఈ నెలలో 1900 డాలర్లకు పడిపోయిన స్పాట్ గోల్డ్ మళ్ళీ పుంజుకోవడానికి దాదాపు 20 రోజుల పట్టింది. జూలై 18న 60వేల మార్కుని టచ్ చేసిన బంగారం మరోసారి తగ్గుతూ వచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం రూ. 60,750కి చేరుకుంది. అయితే గత మూడు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుముఖం పడుతున్న కారణంగా దేశీయంగా కూడా పసిడి ధర దిగొచ్చింది. జూలై 22,23 తేదీల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,160 వద్ద ఉండగా ఇవాళ స్థిరంగా ఉంది.
శని, ఆదివారాల్లో మార్కెట్ క్లోజింగ్ కాబట్టి స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి ఈ ధరలు అప్ డేట్ అవుతాయి. ప్రస్తుతం అంటే ఉదయం 7:45 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1960.84 డాలర్ల వద్ద కొనసాగుతుంది. శనివారం నాడు గ్లోబల్ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1970 డాలర్లు ఉండేది. ప్రస్తుతం 10 డాలర్లు తగ్గింది. దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గనున్నాయి. స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఇక స్పాట్ వెండి అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం 24.67 డాలర్ల వద్ద కొనసాగుతుంది. శనివారం నాడు 24.61 డాలర్ల వద్ద కొనసాగిన స్పాట్ వెండి ఇవాళ స్వల్పంగా పెరిగింది.
దేశీయంగా కూడా వెండి ధర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80,500 వద్ద కొనసాగుతుంది. ఈ రెండు రోజుల్లో కిలో వెండి ఏకంగా రూ. 1900 తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో వెండి ధర పెరిగిన కారణంగా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి వెండి ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది. లేదంటే మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే బంగారం కొనాలనుకునేవారు తగ్గే వరకూ వేచి ఉండడం మంచిది.