గుడ్ న్యూస్.. వరుసగా పెరుగుతున్న వచ్చిన గోల్డ్ రేటు అంతర్జాతీయంగా మరోసారి పతనమైంది. దేశీయంగా ఇవాళ గోల్డ్ రేట్లు పెరిగినా.. తగ్గే అవకాశం ఉంది. మరి బంగారం ఎప్పుడు కొంటే మంచిదంటే?
బంగారం అంటే ఇష్టపడని భారతీయులు ఉండరు. జీవితంలో ఎంతో కొంత బంగారం కొని పోగు చేయాలని ఆశిస్తుంటారు. ఆడవారు విపరీతంగా ఇష్టపడతారు. బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే సమయానుకూలంగా తీసుకుంటారు. గత నెలలో తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రెండుమూడు రోజుల్లో పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లటో గోల్డ్, సిల్వర్ రేట్లు గరిష్ట స్థాయిలో పెరుగుతుండడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో స్పోట్ గోల్డ్ రేటు ఇవాళ పడిపోయింది. ఒక ఔన్స్‌కు ప్రస్తుతం 1970 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న అది 1984 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.
స్పాట్ సిల్వర్ రేటుకు వస్తే 24.86 డాలర్లపైన కొనసాగుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.100 వద్ద కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేటు దిగివచ్చినప్పటికీ హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు మాత్రం పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 55,600 ఉండగా.. నేడు రూ. 100 పెరిగి రూ. 55,700 లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 60,650 ఉండగా.. నేడు రూ. 100 పెరిగి రూ. 60,750 కొనసాగుతుంది.
ఇక వెండి ధరలు పరిశీలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ వెంబడి వెండి ధర కూడా పరుగెడుతుంది. నిన్న కిలో వెండి రూ. 82,000 ఉండగా.. కిలోపై రూ. 400 పెరిగి ప్రస్తుతం కిలో వెండి రూ.82,400కి చేరింది. నిన్న 1984 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ ఇవాళ ఉదయానికి 1970 డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గనున్నాయి. రేపు ఈ ధరలు దేశీయ మార్కెట్ పై ప్రభావం చూపుతాయి. కాబట్టి గోల్డ్ ధరలు తగ్గుతాయి. బంగారం కొనాలనుకునేవారు రేపు కొనడం మంచిది. నిన్న 25.21 డాలర్ల వద్ద కొనసాగిన స్పాట్ వెండి ఇవాళ 24.86 డాలర్ల వద్ద కొనసాగుతుంది. స్వల్పంగా తగ్గింది కాబట్టి దేశీయంగా తగ్గే ఛాన్స్ ఉంది.