చాలా రోజుల తర్వాత బంగారం మళ్ళీ 60 వేల మార్కును దాటింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పుంజుకుంటుంది. ఈ కారణంగా దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సానుకూలంగా సాగుతున్నాయి. అక్కడ ఇన్వెస్టర్లు పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుండడంతో డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతున్నాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1978 డాలర్లు ఉండగా ఇవాళ 1984 డాలర్ల వద్ద కొనసాగుతుంది. రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతుంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిన్న దేశీయ మార్కెట్లో పెరిగిన బంగారం.. ఇవాళ కూడా పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 ఉండగా ఇవాళ రూ. 500 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 55,600 వద్ద కొనసాగుతుంది.
ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 60,100 ఉండగా.. ఇవాళ రూ. 550 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,650 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పెరుగుతుంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 25.03 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ 25.21 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 81,400 ఉండగా ఇవాళ రూ. 600 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 82 వేలు పలుకుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. బంగారం రూ. 63 వేలకి, వెండి రూ. 84 వేలకు చేరే సూచనలు కనబడుతున్నాయి.