పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మరలా బంగారం ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, స్పాట్ వెండి ధరలు ప్రతికూలంగా సాగుతున్నందున దేశీయంగా ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1942 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 1942.8 డాలర్ల వద్ద కొనసాగింది. పెద్దగా మార్పు లేకపోవడం కారణంగా దేశీయంగా బంగారం ధర స్థిరంగా ఉంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150 ఉండగా ఇవాళ కూడా అంతే ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా నిన్నటి ధరే కొనసాగుతుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,160 వద్ద కొనసాగుతుంది. వెండి ధర విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గింది. దీంతో దేశీయంగా వెండి ధర తగ్గనుంది.
మొన్న ఔన్స్ స్పాట్ వెండి 23.63 డాలర్లు ఉండగా.. నిన్న 23.63 డాలర్లు వద్ద కొనసాగింది. అంతర్జాతీయంగా వెండి ధరలో మార్పు లేని కారణంగా దేశీయంగా కూడా స్థిరంగానే కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 78,500 వద్ద కొనసాగుతుంది. అయితే ఈ ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి రానున్నాయి. ప్రస్తుతం అనగా ఉదయం 7:33 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1942.69 డాలర్లు వద్ద కొనసాగుతుంది. ఇక ఔన్స్ స్పాట్ వెండి 23.59 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే ఈ ధర తగ్గింది. అలానే బంగారం కూడా స్వల్పంగా తగ్గింది. కాబట్టి బంగారం, వెండి ధరలు దేశీయంగా తగ్గే ఛాన్స్ ఉంది.