బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, స్పాట్ వెండి ధరలు పెరగడంతో దేశీయంగా కూడా వీటి ధరలు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి గోల్డ్ ధర పెరిగింది. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1936 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 1942 డాలర్ల వద్ద ఉంది. నిన్న స్పాట్ గోల్డ్ ధర పెరగడంతో ఇవాళ దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 వద్ద ఉండగా ఇవాళ రూ. 200 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వద్ద రూ. 59,950 వద్ద కొనసాగగా ఇవాళ రూ. 210 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 60,160 వద్ద కొనసాగుతుంది.
జూన్ నెలలో 24 క్యారెట్ల బంగారం గరిష్టంగా రూ. 61,100 ఉండగా జూలై నెలలో గరిష్టంగా రూ. 60,750 పలికింది. క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర జూలై 13 నుంచి 60 వేల మార్కుని నిలబెట్టుకుంటూ వస్తుంది. మధ్యలో ఒకసారి జూలై 17న స్వల్పంగా తగ్గింది. ఆగస్టులో అయితే రెండు సార్లు 60 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం అయితే 60 వేల పై మార్కుని చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ స్పాట్ గోల్డ్ 1942.8 డాలర్ల వద్ద కొనసాగుతుంది. సానుకూలంగా సాగుతున్న కారణంగా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సోమవారం నాడు స్థిరంగా ఉండచ్చు లేదా స్వల్పంగా పెరగచ్చు.
ఇక వెండి ధర విషయానికొస్తే అంతర్జాతీయ మార్కెట్లో మొన్న ఔన్స్ 23.53 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 23.63 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 78,200 వద్ద కొనసాగగా ఇవాళ రూ. 300 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 78,500 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ట్రేడ్ ముగిసే సమయానికి 23.70 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ వెండి ప్రస్తుతం 23.63 డాలర్ల వద్ద కొనసాగుతుంది. స్వల్పంగా తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. సానుకూలంగా ఉన్న కారణంగా ఈ సోమవారం దేశీయ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉండవచ్చు లేదా స్వల్పంగా పెరగవచ్చు.