బంగారం కొనాలనుకునేవారికి బంగారం షాక్ ఇచ్చింది. నిన్న పుంజుకున్న బంగారం ధర ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. వెండి కూడా బంగారం స్థాయిలోనే పెరిగింది. ఇవాళ దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్ళీ పెరిగింది. యూఎస్ డాలర్ రేటు బలహీనంగా ఉండడం, యూఎస్ డేటా పూర్ గా ఉండడం, ఆర్థిక అనిశ్చితి, యూఎస్ ఫెడ్ ఇంట్రస్ట్ రేటు గరిష్టంగా ఉండడం, చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. డాలర్ రేటు పతనమైన కారణంగా భవిష్యత్తు భద్రత కోసం అందరూ బంగారంలో పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. అందుకే అంతర్జాతీయంగా బంగారంపై డిమాండ్ పెరిగిందని.. అందుకే ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఉదయం 08.38 గంటలకు ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 2011 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర రూ. 24 డాలర్ల పైన ట్రేడ్ అవుతుంది.
దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,250 వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 55,300 ఉండగా.. ఇవాళ రూ. 950 పెరిగింది. వంద గ్రాముల వద్ద ఏకంగా రూ. 9500 వేలు పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 100 గ్రాములకు రూ. 5,62,500 కి చేరుకుంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,625 గా ఉంది. నిన్న 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,530 ఉంది. గ్రాము వద్ద రూ. 95 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా భారీగా పెరిగింది. గ్రాము వద్ద రూ. 103 పెరిగింది. 10 గ్రాముల వద్ద రూ. 1030 పెరగగా.. వంద గ్రాములకు రూ. 10,300 మేర పెరిగింది.
దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 61,360 గా ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 60,330 గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 6,136 గా ఉంది. చూస్తుంటే బంగారం ఈ వారాంతంలో 62 వేల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. ఏకంగా 2900 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 80,700 పలుకుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 77,800 ఉంటే.. ఇవాళ ఏకంగా రూ. 2900 పెరిగింది. భవిష్యత్తులో వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ పతనమవుతుండడం, ఆర్థిక అనిశ్చితి ఇలానే కొనసాగితే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంటున్నారు.