బంగారం కొనాలనుకునే వారికి షాక్ తగిలింది. నిన్న భారీగా తగ్గిన బంగారం ఇవాళ రెట్టింపు ధర నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
నిన్న బంగారం ధర దిగొచ్చిందని సంతోషించే లోపే పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగింది. ఏడాదిలో ఈ ధరకు చేరుకోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2020 డాలర్లు దాటేసింది. ప్రస్తుతం (08.15 IST ) అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 2024.20 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 25.12 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇలా బంగారం, వెండి ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిన్న స్పాట్ గోల్డ్ ధర రూ. 1978 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా.. వెండి 23.87 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఒక్కరోజులో 40 డాలర్లు పైనే గోల్డ్ రేటు పెరిగింది.
అయితే వెండి మాత్రం 2 డాలర్లు మాత్రమే పెరిగింది. 2 నెలల కిందట స్పాట్ గోల్డ్ 1800 డాలర్లు ఉండగా.. వెండి 20 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇప్పుడు మాత్రం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో దేశీయంగా కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 600 పెరిగింది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 54,700 ఉండగా.. ఇవాళ రూ. 55,300 ఉంది. వంద గ్రాముల వద్ద రూ. 6 వేలు పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 100 గ్రాములకు రూ. 5,53,000 కి చేరుకుంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,530 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 660 పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670 ఉండగా.. ఇవాళ రూ. 60,330 ఉంది. నిన్న రూ. 330 తగ్గగా.. ఇవాళ మాత్రం రెండు రెట్లు పెరిగింది. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,033 గా ఉండగా.. వంద గ్రాముల బంగారం రూ. 6,03,300 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం స్థాయిలోనే పెరిగింది. కిలో వెండి ధర రూ. 700 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 77,800 ఉంది. నిన్న రూ. 600 తగ్గి 77,100 గా ఉన్న వెండి ఇవాళ రెండు రెట్లు పెరిగింది.