పసిడి ప్రియులకు శుభవార్త. మళ్ళీ బంగారం ధర తగ్గింది. అక్షయ తృతీయ సందర్భంగా పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం పతనమవుతూ వస్తుంది. మరి ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ఇప్పుడు కొనాలా? వద్దా? అని ఆలోచించే వారికి ఇది నిజంగా మంచి వార్తే. నిన్న అక్షయ తృతీయ సందర్భంగా పెరిగిన బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్నటిలానే ఇవాళ కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మైనస్ లలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. గత పది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకరోజు తగ్గడం, మరొక రోజు పెరగడం ఇలానే జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం అంటే ఏప్రిల్ 24న ఉదయం 8 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1980 నుంచి 1981 డాలర్ల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఏప్రిల్ 20న స్పాట్ గోల్డ్ 1993 డాలర్ల వద్ద ట్రేడ్ అయితే.. నిన్న 1983 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. 3 రోజుల వ్యవధిలో ఏకంగా 10 డాలర్లు తగ్గింది. ఇవాళ అయితే మరో 2 డాలర్లు పతనమైంది. ఇక వెండి ధర కూడా 24.99 డాలర్ల నుంచి 25 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పతనమైన బంగారం.. దేశీయంగా కూడా అలానే పతనమయ్యింది. గడిచిన పది రోజుల్లో 3 సార్లు బంగారం ధర పెరగగా.. ఆరు సార్లు బంగారం దిగొచ్చింది.
గడిచిన పది రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే.. ఏప్రిల్ 14న రూ. 550 పెరుగుదలతో 10 గ్రాముల బంగారం 56,650కి చేరుకుంది. ఏప్రిల్ 15న రూ. 700 తగ్గుదలతో రూ. 55,950కి చేరుకుంది. ఏప్రిల్ 16న రూ. 10 తగ్గగా.. ఏప్రిల్ 17న పెరగడం గానీ, తగ్గడం గానీ జరగలేదు. ఏప్రిల్ 18న రూ. 90 తగ్గగా.. ఏప్రిల్ 20న రూ. 200 పెరిగింది. ఏప్రిల్ 20న రూ. 200 తగ్గి.. ఏప్రిల్ 21న 200 పెరిగింది. ఏప్రిల్ 22న రూ. 300 తగ్గగా.. ఏప్రిల్ 23న రూ. 30 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 55,720 వద్ద కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో బంగారం రూ. 950 పెరగగా.. రూ. 1330 తగ్గింది. అంటే పది గ్రాముల వద్ద పది రోజుల్లో రూ. 380 తగ్గినట్టు.
ఈ పది రోజుల ముందు అంటే ఏప్రిల్ 14కి ముందు 24 క్యారెట్ల బంగారం 62 వేల మార్కును దాటేస్తుంది అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 60 వేలకు పడిపోయే విధంగా బంగారం తగ్గుతుంది. మధ్య మధ్యలో పెరిగినా మళ్ళీ అంతకు ముందు ఉన్న ధరకే పడిపోతుంది. ఏప్రిల్ 14న రూ. 600 పెరుగుదలతో రూ. 61,800కి చేరుకున్న బంగారం.. ఏప్రిల్ 15, 16 తేదీల్లో రూ. 770 తగ్గింది. దీంతో ఏప్రిల్ 16న పది గ్రాముల బంగారం రూ. 61,030 కి చేరుకుంది. ఏప్రిల్ 17న స్థిరంగానే ఉన్న బంగారం.. ఏప్రిల్ 18న మళ్ళీ పడిపోయింది. ఏప్రిల్ 19న రూ. 230 పెరగగా.. ఏప్రిల్ 20న రూ. 220 తగ్గింది. దీంతో బంగారం 61 వేల నుంచి 60 వేలకు చేరుకుంది.
ఏప్రిల్ 20న పది గ్రాముల బంగారం రూ. 60,930 ఉంది. ఏప్రిల్ 21న మళ్ళీ రూ. 220 పెరిగింది. దీంతో 61,150కి చేరుకుంది బంగారం. అక్షయ తృతీయ కాబట్టి ఈ మాత్రం పెరిగింది. అయితే ఏప్రిల్ 22న ట్రేడ్ ముగిసే సమయానికి రూ. 330 తగ్గింది. దీంతో నిన్న బంగారం రూ. 60,820 వద్ద కొనసాగింది. నిన్న ట్రేడ్ ముగిసే సమయానికి రూ. 30 తగ్గింది. దీంతో ఇవాళ ఏప్రిల్ 24న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 60,790 వద్ద కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 10 గ్రాముల బంగారం రూ. 60 వేలకు చేరుకుంటుంది. గడిచిన 10 రోజుల్లో 3 సార్లు పెరగగా.. 6 సార్లు బంగారం ధర తగ్గింది. ఈ పది రోజుల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1050 పెరగగా.. రూ. 1460 తగ్గింది. అంటే పది రోజుల్లో రూ. 410 తగ్గినట్టు.
గత పది రోజులుగా వెండి ధర బాగా పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్ 14న కిలో వెండి రూ. 83 వేలు పలికింది. ఆ ఒక్కరోజే ఏకంగా రూ. 1200 పెరిగింది. ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ 15న ఏకంగా రూ. 1500 తగ్గింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో కిలో వెండి ధర రూ. 81,500 వద్ద కొనసాగింది. ఏప్రిల్ 17న రూ. 100 పెరగ్గా.. ఏప్రిల్ 18న రూ. 1100 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 80,500కి చేరుకుంది. ఏప్రిల్ 19న మళ్ళీ రూ. 500 పెరగగా.. ఏప్రిల్ 20న స్థిరంగా ఉంది. ఏప్రిల్ 21న రూ. 300 పెరగగా.. ఏప్రిల్ 22న ఏకంగా రూ. 900 తగ్గింది. ఏప్రిల్ 23న ట్రేడ్ ముగిసే సమయానికి ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,400 వద్ద కొనసాగుతోంది. వెండి గత పది రోజుల్లో 4 సార్లు పెరగగా.. కేవలం 3 సార్లు మాత్రమే తగ్గింది. పది రోజుల వ్యవధిలో రూ. 2100 పెరగగా.. రూ. 3500 తగ్గింది. అంటే రూ. 1400 తగ్గినట్టు.