పసిడి ప్రియులకు శుభవార్త. మొన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి. అలానే వెండి కూడా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించేలా బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. ఏప్రిల్ 15న 22 క్యారెట్ల బంగారం రూ. 700 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం రూ. 760 తగ్గింది. దీంతో పసిడి ప్రియుల నోరు తీపి చేసినట్టయ్యింది. నిన్న కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం అంటే ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2004 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన పది రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే.. బంగారం కంటే వెండి ధరలు చురుగ్గా పరుగులు పెడుతున్నాయి. ఏప్రిల్ 8న 22 క్యారెట్ల బంగారం రూ. 55,800 ఉండగా.. ఏప్రిల్ 9న రూ. 10 తగ్గింది. ఏప్రిల్ 10న గరిష్టంగా రూ. 390 తగ్గింది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో మాత్రం ఏకంగా రూ. 800 పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది.
ఏప్రిల్ 12న 22 క్యారెట్ల బంగారం రూ. 56,200గా ఉంది. ఏప్రిల్ 13న రూ. 100 తగ్గగా.. ఏప్రిల్ 14న ఏకంగా రూ. 550 పెరిగింది. ఏప్రిల్ 15న రూ. 700 తగ్గగా.. ఏప్రిల్ 16న మాత్రం రూ. 10 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,940 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ఐతే ఏప్రిల్ 8న 60,870 ఉండగా.. ఏప్రిల్ 9న కేవలం రూ. 10 తగ్గింది. ఏప్రిల్ 10న రూ. 430 తగ్గగా.. ఏప్రిల్ 11, 12 తేదీల్లో మాత్రం ఏకంగా రూ. 880 తగ్గింది. ఏప్రిల్ 13న రూ. 110 తగ్గగా.. ఏప్రిల్ 14న రూ. 600 పెరిగింది. ఏప్రిల్ 15న మాత్రం రూ. 760 తగ్గింది. ఏప్రిల్ 16న కేవలం రూ. 10 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 61,030 వద్ద కొనసాగుతోంది. నెల రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 60 వేలకు పైనే ఉంటుంది గానీ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇక 22 క్యారెట్ల బంగారం 55 వేలకు తగ్గడం లేదు. అదే రేంజ్ ని మెయింటెయిన్ చేస్తున్నాయి. ఇక వెండి ధరలు చేసుకుంటే కిలో వెండి ధర రూ. 81 వేల మార్కుని దాటేసింది. గడిచిన పది రోజులుగా చూసుకుంటే కిలో వద్ద రూ. 1300 తగ్గింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో కిలో వెండి ధర రూ. 80,200 ఉండగా ఏప్రిల్ 10న రూ. 200 మేర తగ్గి 80 వేలకు చేరింది. ఏప్రిల్ 11, 12, 13, 14 తేదీల్లో మాత్రం వరుసగా 4 రోజులు వెండి ధరలు ఏకధాటిగా దండయాత్ర చేశాయి. ఏకంగా ఒక కిలో వద్ద రూ. 3 వేలు పెరిగింది. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఏప్రిల్ 15న సరాసరి రూ. 1500 తగ్గింది. ఏప్రిల్ 16న ఎలాంటి మార్పులు లేకపోవడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 81,500 వద్ద కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో అత్యధికంగా ఏప్రిల్ 14న రూ. 83 వేలు ఉంది. మొన్న భారీగా తగ్గడంతో రూ. 81,500 ఉంది. బంగారం కంటే కూడా వెండి కొనడం ఉత్తమం అని చెప్పవచ్చు.