పసిడి ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. మొన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర నిన్న భారీగా పెరిగింది. ఇవాళ ఏకంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 600 పెరిగింది. ప్రస్తుతం అంటే ఉదయం 9.00 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2004.39 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.39 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండు రోజుల ధరలతో పోలిస్తే ఇది తక్కువే. అయినప్పటికీ అక్షయ తృతీయ సందర్భంగా బంగారంపై డిమాండ్ ఉన్న కారణంగా దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. గడిచిన 10 రోజులుగా బంగారం , వెండి ధరలు చూసుకుంటే.. ఏప్రిల్ 5న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 950 పెరుగుదలతో రూ. 56,250కి చేరుకుంది.
24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ. 1030 పెరుగుదలతో 61 వేల మార్కును దాటేసింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10 వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం.. ఏప్రిల్ 11న ఒక్కసారిగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 300 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 330 పెరిగింది. ఆ మరుసటి రోజైనా తగ్గుతుందేమో అనుకుంటే అబ్బే తగ్గేదేలే అన్నట్టు భారీగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం మీద రూ. 500 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 550 పెరిగింది. ఏప్రిల్ 13న స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చింది. 22 క్యారెట్ల బంగారం మీద రూ. 100 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 110 తగ్గింది.
నిన్న అయితే ఏకంగా 22 క్యారెట్ల బంగారం మీద రూ. 550, 24 క్యారెట్ల బంగారం మీద రూ. 600 పెరిగింది. దీంతో ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800కి చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ. 1200 పెరిగింది. ఈ పది రోజుల్లో ఇదే హయ్యెస్ట్ ప్రైజ్. దీంతో కిలో వెండి ధర రూ. 83,000 మార్కును చేరుకుంది. పది రోజుల క్రితం 80 వేల దగ్గరున్న వెండి పది రోజుల్లో ఏకంగా రూ. 3 వేలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 83 వేలుగా ఉంది.