మరో నెల రోజుల్లో వివాహాల సీజన్ ప్రారంభం అవుతుంది. బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇప్పుడే పసిడి ధర విపరీతంగా పెరుగుతుంటే.. మరి శుభకార్యాల వేళ ఎలా ఉండనుందో అర్థం కావడం లేదు. ఇక నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
బంగారం ధరలు వరుసగా పది రోజులు పెరగడం.. ఆ తర్వాత రెండు మూడు రోజులు ధర తగ్గడం లేదంటే నిలకడగా ఉండటం జరుగుతోంది. ఇప్పటికే మార్చి నెలలో పసిడి ధర.. ఈ ఏడాది గరిష్టానికి చేరింది. ఈ పెంపు ఇలానే కొనసాగుతుందా.. లేదా అన్న విషయం అర్థం కావడం లేదు. మరో నెలలో వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. దాంతో బంగారం కొనాలనుకునేవారు.. అప్పటి వరకు ధర ఏమన్నా తగ్గుతుందా లేదా అన్న విషయం అర్థం కాక.. అయోమయంలో పడ్డారు. వివాహాల సీజన్ సమయంలో బంగారం ధర ఇలానే పెరిగితే కొనుగోలు చేయడం కష్టం అంటున్నారు. గత పది రోజులుగా బంగారం ధర పెరగ్గా.. రెండు, మూడు రోజులుగా స్థిరంగా ఉంది. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది.. పెరిగిందా.. తగ్గిందా అంటే..
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో డాలర్ పుంజుకుంటోంది. దాంతో బంగారం ధర కాస్త తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నేడు బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాములకు ప్రస్తుతం రూ.54,700 మార్క్ వద్ద ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం తులం ధర రూ. 59,670 గా కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర క్రితం సెషన్‌తో పోలిస్తే.. స్థిరంగా ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం తులం ధర క్రితం సెషన్‌తో పోలిస్తే స్థిరంగా ఉండి..54,850గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి ధర తులం రేటే 59,820గా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే రెండు రోజులుగా బంగారం మాదిరిగానే స్థిరంగా ఉన్న ధర.. నేడు భారీగా పెరిగింది. కిలో మీద ఏకంగా రూ.500 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.76,200 గా ఉంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ.73,300 వద్ద ఉంది.