పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ప్రియులకు నేడు బంగారం ధర గుడ్ న్యూస్ చెప్పింది. మరి నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..
మే నెల ప్రారంభం నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతోంది. మే నెల నుంచి జూన్ వరకు శుభకార్యాలు జరుపుకోవడానికి మంచి రోజులు ఉన్నాయి. ఇక మన దేశంలో వివాహాది శుభకార్యాల వేళ.. బంగారం కొనుగోలు తప్పనిసరి. ఎంత పేద వారైనా సరే.. వివాహం సందర్భంగా కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. పది రోజుల పాటు బంగారం ధర భారీగా పెరిగితే.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తగ్గుతూ వస్తోంది. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయిన తరుణంలో బంగారం ధర దిగి వస్తుండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బంగారం కొనుగోలుకు రెడీ అవుతున్నారు. ఇక నేడు బంగారం ధర ఎంత దిగి వచ్చింది.. తులం ధర ఎంత ఉంది.. వంటి పూర్తి వివరాల కోసం..
ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం స్థిరంగా ఉంది. నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.60,760 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హస్తినలో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.55,850 మార్కు వద్ద ట్రేడవుతుండగా.. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 60,910 మార్కు వద్ద స్థిరంగా ఉంది.
ఇక బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం పెరిగింది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి రూ.76,100కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. ఒక్కరోజే రూ.300 మేర ఎగబాకింది. ఇక నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,500 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా బంగారం ధర స్థిరంగా ఉండగా.. అంతర్జాతీయంగా మాత్రం బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇక నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు మళ్లీ 2015 డాలర్లకు ఎగబాకింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా 25.30 డాలర్ల మార్కుపైకి చేరింది.