బంగారం కొందాము అనుకునే వారికి.. పసిడి ధరల తీరు చూస్తే.. గందరగోళంగా ఉంది. కొన్ని రోజుల పాటు భారీగా పడిపోతూ ఉంటుంది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపే.. భారీగా పెరుగుతూ.. షాకిస్తోంది. ఇక నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉంది. ఈ ఏడాది ప్రాంరభంలో బంగారం ధర భారీగా పెరిగింది. దాంతో.. 2023, దీపావళి నాటి బంగారం ధర.. తులం ఏకంగా లక్ష రూపాయలు అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా ఫిబ్రవరి నెల మొత్తం బంగారం ధర భారీగా పడిపోతూ వస్తుంది. పసిడి ధరలు ఇలా పతనమవుతూనే ఉంటే.. మార్చి చివరి నాటికి తులం 50 వేల రూపాయల దిగువకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు మార్కెట్ నిపుణులు. అయితే అందుకు భిన్నంగా మార్చి నెల ప్రారంభం నుంచి బంగారం ధర.. పెరుగుతూనే ఉంది. మార్చి మొదలైన నాటి నుంచి పసిడి ధరపెరుగుతూనే ఉంది. ఇక నేడు హైదరాబాద్ సహా దేశీయంగా పసిడి ధర ఎంత ఉంది.. తగ్గిందా, పెరిగిందా.. నేడు తులం బంగారం ధర ఎంత ఉంది అంటే..
ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర క్రితం రోజు అనగా ఆదివారంతో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.51,850 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. ఇక నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం రేటు ప్రస్తుతం రూ.56, 550 మార్క్ వద్ద ఉంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా పుత్తడి ధర స్థిరంగానే ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం తులం ధర రూ.51, 950 వద్ద ఉండగా.. 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మాదిరిగానే.. రూ.56, 550 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే.. గత మూడు రోజులుగా సిల్వర్ ధరలో ఎలాంటి మార్పు లేకుండా.. స్థిరంగా కొనసాగుతోంది. ఇక నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర 70 వేల రూపాయలుగా ఉంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.76 వేల మార్కును తాకిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వెండి ధర కూడా భారీగా తగ్గుతూ వచ్చి రూ.70 వేలకే చేరడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇకదేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం ఇవాళ వెండి ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో సిల్వర్ రేటు రూ.66,900 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరలే కొనసాగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1856.95 డాలర్లగా ట్రేడవుతోంది. ఇక వెండి ధర 21.29 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోల్చి చూసినట్లయితే ప్రస్తుతం రూ.81.688 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులకు అనుగుణంగా.. మన దగ్గర బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి.