గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు పెరిగింది. మరి నేడు 10 గ్రాముల బంగారం ధర ఎంత పెరిగింది.. వెండి ధర ఎంత ఉంది అంటే..
బంగారం ధరలో అస్థిరత కారణంగా పసిడి కొనాలునుకునే వారు అయోమయపడుతున్నారు. కారణం బంగారం ధర కొన్ని రోజుల పాటు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగా ఉంటుంది. అయితే పెరుగుతున్న ధర కారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో కూడా పసిడికి డిమాండ్ భారీగా తగ్గింది. అయితే గత రెండు సెషన్‌లలో స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ వెండి ధర పడిపోగా.. దేశీయంగా మాత్రం వెండి, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దాంతో బంగారం కొనాలనుకునేవారు.. ఇప్పుడే త్వరపడితే మంచిదని.. లేదంటే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. మరి నేడు బంగారం ధర ఎంత పెరిగింది అంటే..
నేడు హైదరాబాద్ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ బంగారం రేటు 10 గ్రాముల మీద తాజాగా రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22క్యారెట్ బంగారం పది గ్రాముల ధర రూ.56,750కి చేరింది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా 10 గ్రాముల మీద ఒక్కరోజే రూ. 110 పెరిగి రూ.61,910 వద్ద ఉంది. మరోవైపు ఢిల్లీ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేటు ఒక్కరోజే రూ.100 పెరిగింది. దాంతో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.56,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ బంగారం రేటు 10 గ్రాముల మీద రూ.110 పెరిగి రూ.62,060కే చేరింది.
వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు ఒక్క రోజే కిలో వెండి మీద రూ.300 పెరిగింది. నేడు ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.300 పెరిగి ఇప్పుడు రూ.75,100కు చేరింది. అదే హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రేటు రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.78,800 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం, వెండి రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్నులను బట్టి బంగారం, వెండిధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సుకు ఇప్పుడు 1990 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలానే స్పాట్ సిల్వర్ రేటు కూడా భారీగా పడిపోయింది. 24 డాలర్లపైన ఉండే రేటు ఇప్పుడు ఔన్సుకు 23.70 డాలర్ల వద్దకు వచ్చింది.