బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్నాయి. నిన్నటి వరకు తగ్గిన ధర.. నేడు భారీగా పెరిగి షాకిచ్చింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
బంగారం ధరలు సామాన్యులకు షాక్‌ల మీద షాకులు ఇస్తోంది. రెండు మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. మళ్లీ పెరిగింది. త్వరలోనే వివాహాల సీజన్ రాబోతుంది. బంగారం కొనుగోళ్లు పెరుగాతాయి. ఇలాంటి వేళ పసిడి ధర పెరిగితే.. సామాన్యులకు అంది మరింత భారం అవుతుంది. కానీ బంగారం ధర మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా.. అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉంది. ఇక నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం మీద ఎంత పెరిగింది.. దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే..
ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మీద రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.55,850 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాముల మీద రూ.220 పెరిగింది. ప్రస్తుతం నగరంలో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,930కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22 క్యారెట్ బంగారం రేటు రూ.250 మేర పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.56 వేలు పలుకుతోంది. అలానే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.220 మేర పెరిగి ప్రస్తుతం రూ.61,80 మార్క్ వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే అది కూడా బంగారం దారిలోనే పరుగులు పెడుతోంది. క్రితం రెండు సెషన్లలో భారీగా తగ్గినట్లు కనిపించిన వెండి ధర ఇవాళ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.700 మేర భారీగా పెరిగింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.80,700 పలుకుతోంది. అలానే ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.76,700 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.