కొన్ని రోజులుగా నేల చూపులు చూసిన పసిడి ధర నెమ్మదిగా పైపైకి చేరుతోంది. మార్చి ప్రారంభం నుంచి బంగారం ధర నెమ్మదిగా పెరుగుతోంది. అలానే వెండి ధర కూడా భారీగానే పెరిగింది. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే..
కొన్ని రోజులుగా బంగారం ధర దిగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధర తగ్గుతూ వస్తుండటంతో సామాన్యులు సైతం ఊరటగా ఫీలయ్యారు. ఈ ఏడాది గరిష్టానికి చేరిన బంగారం ధర.. ఫిబ్రవరి నెలలో పడిపోతూ వచ్చింది. దాంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే మార్చి ప్రారంభం నుంచి బంగారం ధర నెమ్మదిగా పైపైకి చేరుతోంది. నెల ప్రారంభం నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ఇక నేడు అనగా గురువారం కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర స్వల్పంగా పెరగడంతో.. దేశీయంగా కూడా బంగారం ధర స్పల్పంగా పెరిగింది. నేడు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధర తులం మీద ఎంత పెరిగింది.. నేడు తులం ధర ఎలా ఉందంటే..
ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం తులం రూ.51,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ.170 మేర పుంజుకుని ప్రస్తుతం రూ.56 290కు చేరింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లిలో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ బంగారం ధర తులం మీద రూ.150 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ గోల్డ్ తులానికి రూ.51, 750 గా ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ.170 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,440కి చేరింది.
ఇక వెండి విషయానికి వస్తే బంగారాన్నిఅనుసరిస్తోంది. పసిడి బాటలోనే సిల్వర్ సైతం వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. బుధవారం కిలో వెండి రూ.200 పెరగగా.. గరువారం ఏకంగా రూ.1000 మేర పుంజుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.70,200 కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.67 వేల వద్దకు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర చాలా తక్కువగా ఉంటుంది. బంగారం మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఫిబ్రవరి నెల మొత్తం తగ్గుతూ వచ్చిన పసిడి ధర.. ఈ నెల ప్రారంభం నుంచి పెరగడంతో పసిడి ప్రియులు ఆందోళనలో ఉన్నారు.