గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన పసిడి ధర.. అక్షయ తృతీయ పర్వదినం ముందు రోజున భారీగా దిగి వచ్చింది. దాంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి అంటే..
అక్షయ తృతీయ అనగానే మర దగ్గర ఓ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొనుగోలు చేస్తే.. ఇక ఆ ఏడాది అంతా.. మన ఇంటికి సంపద వచ్చి చేరుతుందని నమ్ముతారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. ఇప్పటికే 24 క్యారెట్ బంగారం ధర.. 60 వేల రూపాయలకు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ బంగారం ధర కూడా 55 వేల రూపాలయకు పైగా పెరిగింది. దాంతో ఈ ఏడాది అక్షయతృతీయకు బంగారం డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా అక్షయ తృతీయ ముందు పసిడి ధర తగ్గింది. దాంతో బంగారం కొనాలుకునేవారికి ఇదే మంచి చాన్స్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరి ఇంతకు నేడు బంగారం ధర ఎంత ఉంది.. తులం మీద ఎంత పెరిగింది అంటే..
ఇక నేడు దేశీయంగా అంటే హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. నేడు అనగా శుక్రవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.200 మేర తగ్గింది. ఇక నేడు భాగ్యనగరంలో.. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,850 మార్కు వద్ద ఉంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 మేర పడిపోయి రూ.60,930 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కూడా పసిడి ధర పతనం అయ్యింది. హస్తినలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 200 పడిపోయి రూ.56 వేల మార్కును చేరింది. అలానే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద రూ.230 తగ్గి రూ.61,080 వద్ద ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. పసిడి ధర మాదిరిగానే వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. ఇక నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రేటు స్థిరంగా రూ.81 వేల మార్కు వద్ద ఉంది. అయితే ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో మాత్రం వెండి ధర భారీగా దిగి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.77,400 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌లో పోలిస్తే.. ఢిల్లీలో బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. ఇందుకు కారణం స్థానికంగా ఉండే పన్ను రేట్లు దీనిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఢిల్లీలో పసిడి రేటు ఎక్కువగా.. వెండి రేటు తక్కువగా ఉంటుంది. ఢిల్లీలో పోలిస్తే.. హైదరాబాద్‌లో చూస్తే గనుక బంగారం రేటు కాస్త తక్కువగా, సిల్వర్ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు కొనుగోలు చేయకుండా.. కొన్ని రోజులు ఆగితే మంచిది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.