బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పెరిగినప్పుడు కాకుండా తగ్గినప్పుడు కొనాలని అనుకుంటారు. మరి బంగారం ధర ఇవాళ ఎంత ఉంది? రేపు తగ్గుతుందా? లేదా? అనే వివరాలు మీ కోసం.
బంగారం కొనాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం మళ్ళీ తగ్గుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర రూ. 1965 డాలర్లు ఉండగా.. స్పాట్ వెండి ఔన్సు ధర రూ. 23.16 డాలర్లుగా ఉంది. ఈ ధరలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మాత్రం ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉంది. నిన్నటి మీద పోలిస్తే ఇవాళ రూ. 200 పెరిగింది. నిన్న ఇదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 54,500 ఉంది. నిన్నటికి, ఇవాళ్టికి రూ. 10 తేడా కనిపిస్తోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ హైదరాబాద్ లో రూ. 59,670 గా ఉంది. ఇవాళ 10 గ్రాముల వద్ద రూ. 220 పెరిగింది.
ఇదే బంగారం ధర నిన్న రూ. 240 తగ్గి రూ. 59,450 గా ఉంది. నిన్నటికి, ఇవాళ్టికి స్వచ్ఛమైన బంగారం ధర రూ. 20 తేడా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పతనమయ్యింది. కాబట్టి రేపు బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ నెల మార్చి 20 నుంచి 29 వరకూ 24 క్యారెట్ల బంగారం ధరలు చూసుకుంటే ఈ పది రోజుల్లో రూ. 1660 తగ్గితే.. రూ. 1310 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ఈ పది రోజుల్లో రూ. 1200 పెరగగా.. రూ. 1800 తగ్గింది. ఈ పది రోజుల్లో 4 సార్లు పెరగగా, 5 సార్లు తగ్గింది. బంగారం ధరలు తక్కువ సార్లు పెరుగుతుండగా.. ఎక్కువ సార్లు పడిపోతూ వస్తుంది. ప్రస్తుతం అంటే 11.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సు వద్ద రూ. 1963.71 డాలర్లు వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఇవాళ హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 75,700 ఉంది. నిన్న, ఇవాళ ధరల్లో ఎలాంటి మార్పులూ లేవు. ఇవాళ కూడా నిన్నటి ధరే కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో వెండి రూ. 2300 పెరగగా.. రూ. 1000 మాత్రమే తగ్గింది. వెండి ధరలు ఈ పది రోజుల్లో 5 సార్లు పెరగగా.. 2 సార్లు మాత్రమే వెండి ధర తగ్గింది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం అంటే 11.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర రూ. 23.12 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో వెండి పతనమయ్యింది. ఈ ధరలు రేపు అప్డేట్ అవుతాయి కాబట్టి రేపు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.