భూమి రేటు అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. భూమి మీద పెట్టుబడి పెట్టి చాలా మంది లాభాల బాట పట్టారు. ఒకప్పుడు ఉన్న కొండలు, గుట్టలు ఇప్పుడు ఐటీ హబ్ లుగా, నగరంలోనే ప్రధాన ప్రాంతాలుగా, రిచెస్ట్ ఏరియాలుగా అభివృద్ధి చెందాయి. ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ వంటి ప్రాంతాలు కేవలం కొండలు. వాటిని పిండి చేసి రియల్ ఎస్టేట్ విస్తరలో చక్కగా వడ్డిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో స్థలం కొనాలంటే అసాధ్యం. బాగా డబ్బున్న వారు తప్పితే మామూలు సామాన్యులు కొనలేరు. అప్పట్లో ఈ ఏరియాల్లో చాలా చౌక ధరకు భూములు కొనేసిన వారు ఇప్పుడు కోటీశ్వరులైపోయారు.
ఒకప్పుడు డబ్బు ఉండి కూడా మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కొనలేకపోయి ఉండవచ్చు. చెట్లు, చేమలు, కొండలు ఉన్న ఆ ప్రాంతాలు ఏం డెవలప్ అవుతాయిలే అని అనుకుని ఆగిపోయి ఉండవచ్చు. తీరా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాక, అక్కడి స్థలాల ధరలు పెరిగాక కొని ఉంటే బాగుండేది అని బాధపడి ఉండచ్చు. ఐతే ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో పెట్టుబడి పెట్టలేదని బాధపడేవారు ఇప్పుడు మరో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలుగా మారబోతున్న ఏరియాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందవచ్చు. ఆ ఏరియాలు ఏంటనేది చూసుకుంటే.. ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాలు ఇలా వీటిలో స్థలాల మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఈ ఏరియాలు గచ్చిబౌలి, మాదాపూర్ సిటీలను మించిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే అభివృద్ధిని కేవలం మాదాపూర్ కో, గచ్చిబౌలికో పరిమితం చేయాలని అనుకోవడం లేదు. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కూడా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి నగరాలు శివారు ప్రాంతాల్లో వస్తాయి. ముంబై హైవేలో చదరపు గజం రూ. 12 వేల నుంచి ఉన్నాయి. ముంబై హైవేలో జహీరాబాద్, కంకోల్, సదాశివపేట, సంగారెడ్డి, ముత్తంగి ప్రాంతాలు ఉత్తమ పెట్టుబడి మార్గంగా చెబుతున్నారు. జహీరాబాద్ లో 13 వేల ఎకరాల్లో నిమ్జ్ వస్తుంది. జహీరాబాద్, జరాసంగం, న్యాల్కల్ మండలాల్లో అతి పెద్ద మేనుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది.
ఇది వస్తే కనుక అనేక కంపెనీలు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఇక్కడ భూమికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోతుంది. కొనాలన్నా కొనలేని పరిస్థితి. ఇక్కడ స్థలం కొనాలంటే గజం రూ. 6 వేలు, రూ. 7 వేలు, రూ. 10 వేలు పెట్టాలి. అంటే చదరపు అడుగుకు రూ. 600 నుంచి రూ. 1000 అవుతుంది. ఈ రేటులో హైదరాబాద్ లో స్థలం కొనడం అంటే కష్టమే. కానీ ఈ ఏరియాల్లో స్థలం కొంటే భవిష్యత్తులో భూముల ధరలకు రెక్కలొస్తాయి. ఒకప్పుడు మాదాపూర్,గచ్చిబౌలి ఏరియాలు ఇలా అభివృద్ధి చెందుతాయని ఎవరైనా ఊహించారా? అలానే ఇదీనూ. బెంగళూరు హైవేలో కొత్తూరు, పింజర్ల వంటి ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు.
ఈ ఏరియా వైపు ఐటీ కారిడార్, రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. వరంగల్ హైవే కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏరియాగా చెప్పుకోవచ్చు. ఐటీ రంగాన్ని వరంగల్ కి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ఏరియా కూడా భవిష్యత్తులో ఐటీ హబ్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఇలానే శ్రీశైలం హైవే, విజయవాడ హైవేల్లోని ఏరియాలు కూడా పెట్టుబడికి అనుకూలమని చెబుతున్నారు. విజయవాడ హైవే, చౌటుప్పల్ రాబోయే రోజుల్లో మరో గచ్చిబౌలి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడే ఈ ఏరియాల్లో స్థలాలు కొని పెట్టుకుంటే 5, 10, 15 ఏళ్లలో లక్షలు, కోట్లు లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
గమనిక: ఇది కేవలం మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించచవలసినదిగా మనవి.