ఓటీటీ యాప్స్ అన్నీ ఒకే చోట ఉంటే, ఒకే ప్లాన్ తో తక్కువ ధరకు అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో కదా. రూ. 349 కే 26 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఆ యాప్స్ ఏంటో? ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.
జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కొత్త సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో వచ్చేస్తుండడంతో ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, కుటుంబమంతా కలిసి చూసుకోవచ్చు. అయితే ఈ సినిమాలు అన్నీ ఒకే ఓటీటీలో విడుదలైతే పర్లేదు. ఒకటి ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుద్ది. మరొకటి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుద్ది. ఒకటి ఆహా, మరొకటి ఊహా.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ప్రతీ యాప్ ని సబ్ స్క్రైబ్ చేసుకుంటూ పోతే ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ కోసం నెలకు రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీ5 యాప్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలంటే ఏడాదికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం మొబైల్ లో చూడడానికే.
ల్యాప్ టాప్, టీవీల్లో చూడాలంటే ఏడాదికి రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ. 58 పడినట్లు. సోనీ లివ్ అయితే నెలకు రూ. 299 చెల్లించాలి. ఆహాలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలంటే ఏడాదికి రూ. 399 లేదా రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 4,5 ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలంటే నెలకు కనీసం రూ. 1500 వరకూ అవుతుంది. అదే ఈ ఓటీటీ యాప్స్ అన్నీ ఒకే చోట ఉంటే.. రూ. 399కే 26 రకాల ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉంటే మీకు సంతోషమే కదా. టాటా ప్లే బింజ్ ఒకే చోట 26 ఓటీటీ యాప్స్ ని ఉంచింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఉన్నటువంటి ఓటీటీ కంటెంట్ ను సింగిల్ ప్లాన్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆహా, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, వూట్ సెలెక్ట్, ఎంఎక్స్ ప్లేయర్, సన్ ఎన్ఎక్స్టీ, ఈరోస్ నవ్, హంగామా సహా 26 ప్రముఖ ఓటీటీ యాప్స్ ను ఒకే ప్లాన్ మీద అందిస్తోంది. ఆహా కోసం సెపరేట్ గా, జీ5 కోసం సెపరేట్ గా లాగిన్ అయ్యి, ప్లాన్ ఎక్స్ పైర్ అయిన ప్రతిసారీ లాగిన్ అవ్వాల్సిన పని లేదు. టాటా ప్లే బింజ్ యాప్ తో ఒకసారి లాగిన్ అయి, ఒకసారి పే చేస్తే చాలు. నెలంతా ప్రముఖ ఓటీటీ కంటెంట్ ని చూడవచ్చు. కొత్తగా విడుదలైన కంటెంట్ చూడవచ్చు. 12 కంటే ఎక్కువ భాషల్లో కంటెంట్ ను చూడవచ్చు. ఈ రూ. 349 మెగా ప్లాన్ తో ఒకేసారి 4 డివైజెస్ లో చూడవచ్చు. మొబైల్, వెబ్, ఎఫ్టీవీ, బింజ్+, స్మార్ట్ టీవీల్లో చూడవచ్చు. మరో రెండు ప్లాన్స్ కూడా ఉన్నాయి. మొబైల్ ప్రో, సూపర్ ప్లాన్స్. మొబైల్ ప్రో ప్లాన్ ధర నెలకు రూ. 199. ఈ ప్లాన్ ద్వారా 20 ఓటీటీ యాప్స్ ను పొందవచ్చు. ఈ ప్లాన్ లో ఆహ, డిస్నీ+హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి యాప్స్ అందుబాటులో ఉంటాయి.
మరొక ప్లాన్ సూపర్ ప్లాన్.. దీని ధర నెలకు రూ. 249. ఈ ప్లాన్ తో 23 ఓటీటీ యాప్స్ ను పొందవచ్చు. ఇందులో కూడా ఆహా, డిస్నీ+హాట్ స్టార్, జీ5, సోనీ లివ్ యాప్స్ పొందవచ్చు. మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ అయితే తగ్గింపు లభిస్తుంది. మూడు నెలలకు 26 యాప్స్ అందించే మెగా ప్లాన్ ధర మామూలుగా అయితే రూ. 1047 పడుతుంది. కానీ మూడు నెలలకు సబ్ స్క్రైబ్ చేసుకోవడం వల్ల రూ. 989 పడుతుంది. ఈ ప్లాన్ తో మీరు రూ. 58 ఆదా చేసుకోవచ్చు. ఏడాది మెగా ప్లాన్ ధర మామూలుగా అయితే రూ. 4188 పడుతుంది. కానీ ఒకేసారి ప్లాన్ కొనడం వల్ల రూ. 3839 అవుతుంది. ఈ ప్లాన్ తో రూ. 349 ఆదా చేసుకోవచ్చు. సూపర్ ప్రో ప్లాన్ మూడు నెలల ధర రూ. 709, ఏడాది ధర రూ. 2739 గా ఉంది. మొబైల్ ప్రో ప్లాన్ మూడు నెలల ధర రూ. 569 ఉండగా.. ఏడాది ధర రూ. 2,189గా ఉంది.