దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు ఈ భారం భరించలేక ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్లను అందుబాటులోకి తెచ్చాయి.
దేశంలో రోజూ రోజుకూ పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, బైక్లు, స్కూటర్లే కాదు.. సైకిళ్లు కూడా పెద్ద సంఖ్యలో మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు టాటా స్ట్రైడర్ మార్కెట్లోకి కొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాటల వినియోగం వల్ల కాలుష్యం ఉండదు.. మంచి సౌకర్యం కూడా ఉంటుంది. దేశంలో టాటా గ్రూప్ ఏది లాంచ్ చేసిన మంచి నాణ్యతతో పాటు కొత్తదనం కూడా ఉంటుంది. నానో కారుతో మార్కెట్ లో కొత్త ఒరవడి సృష్టించి. తాజాగా ఇప్పుడు మార్కెట్ లోకి ఎలక్ట్రికల్ సైకిల్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ‘టాటా స్ట్రైడర్ జీటా ప్లస్’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేసింది. ఇది సామాన్యులకు బడ్జెట్ సైకిల్ అని అంటున్నారు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ ధర రూ.26,995 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ రేటు కొంతకాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ ధరకు మీరు ఎలక్ట్రిక్ సైకిల్ ఖరీదు చేయవొచ్చు.
త్వరలో ఈ సైకిల్ రేటు రూ.32,995 కి పెరుగుతుందని అంటున్నారు. అంటే దీని రేటు రూ.6 వేలు పైకి చేరనుంది. అధికార వెబ్ సైట్ నుంచి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ సైకిల్ ని ఇప్పుడే కొనుగోలు చేస్తే రెండేళ్ల వారంటీని కూడా పొందే అవకాశం ఉంది. టాటా స్ట్రైడర్ జీటా ప్లస్ సైకిల్ కి 250 W బీఎల్డీసీ మోటార్ ని కంపెని ఉపయోగించింది. ఇది అన్నివాతావరణ పరిస్థితుల్లోనూ పని చేస్తుంది. అలాగే 36 V-6AH బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 216 డబ్ల్యూహెచ్ పవర్ అవుట్‌పుట్ ని ఇస్తుంది. ఈ సైకిల్ కి ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 30 కిలో మీటర్ల వరకు ప్రయాణించవొచ్చు. గంటకు 25 కిలోమీటర్లు స్పీడ్ కలిగిఉంటుంది. ఈ సైకిల్ లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఏర్పాటు చేయడం వల్ల బాగా కంట్రోల్ చేయవొచ్చు.
ఏది ఏమైనా ప్రస్తుతం కాలంలో లక్షలు ఖర్చు పెట్టి పెట్రోల్ తో నడిచే వాహనాలు కొనుగోలు చేయడం కంటే ఎలక్ట్రిక్ సైకిల్ బెటర్ అని అనుకుంటున్నారు సామాన్యులు. ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పెట్రోల్ ఖర్చు లేకుండా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు మినిమమ్ 25 కీలోమీటర్ల స్పీడ్ తో ఈజీగా వెళ్లవొచ్చు. నగరాల్లో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లపై ఈ మాత్రం స్పీడ్ సరిపోతుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం ఉండదు. చిన్నా, పెద్ద ఎవరైనా ఈ సైకిల్ ని ఈజీగా నడపవొచ్చు. ఈ సైకిల్ కి డిస్క్ బ్రేక్స్ ఉండటం వల్ల స్పీడ్ వెళ్లినా బాగా కంట్రోల్ చేయవొచ్చు. ఎన్నో మంచి ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్ అంటున్నారు.