అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. ఈ మధ్యకాలంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. పైగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాటిపై రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ఆయిల్ ఖర్చులు తప్పడమే కాదు.. మెయిన్టినెన్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈవీలు కూడా 125 సీసీల్లో వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈవీలను తయారు చేస్తుండగా.. ఇప్పుడు ప్రముఖ టూవీలర్ కంపెనీలు కూడా విద్యుత్ స్కూటర్ల తయారీనీ ప్రారంభించాయి. టీవీఎస్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు మోడల్స్ పై బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి.
టీవీఎస్ కంపెనీకి చెందిన టూవీలర్స్ కి ఎంతో మంచి ఆదరణ ఉంది. హీరో, హోండా వంటి దిగ్గజ కంపెనీలతో టీవీఎస్ ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈవీల్లో కూడా ఈ కంపెనీల మధ్య పోటీ నడుస్తోంది. టీవీఎస్ నుంచి ఐక్యూబ్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పటికే రిలీజ్ అయ్యి చాలా మంది గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఐక్యూబ్ ఎస్ మోడల్ కూడా విడుదలైంది. ఇప్పుడు ఐక్యూబ్ ఎస్ మోడల్ కి కూడా మంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఇందులో ఐక్యూబ్ ST మోడల్ కూడా ఉంది. ప్రస్తుతం దానికి బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. టీవీఎస్ మొత్తం 22 సిటీల్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రీ బుకింగ్స్ సౌకర్యం కల్పించింది.
ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ మోడల్స్ కి బుకింగ్స్ నడుస్తున్నాయి. ఈ రెండు వేరియంట్లపై ఫేమ్ 2 సబ్సిడీ కూడా లభిస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1,66,293 కాగా.. ఫేమ్ 2 సబ్సిడీ రూ.51 వేలు పోను ఆన్ రోడ్ ప్రైస్ రూ.1,15,293గా ఉంది. ఈ వేరియంట్ 3 కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇది 100 కిలోమీటర్ల రేంజ్, 78 కిలో మీటర్ల గరిష్ట స్పీడ్ తో వస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ధర రూ.1,72,413కాగా ఫేమ్ 2 సబ్సిడీ రూ.51 వేలు పోను రూ.1,21,413గా ఉంది. ఈ వేరియంట్ 4 కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 78 కిలో మీటర్ల గరిష్ట వేగం, 100 కిలో మీటర్ల రేంజ్ తో వస్తోంది. మరిన్ని వివరాల కోసం టీవీఎస్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.