నేటికాలం లో బ్యాంకింగ్ సేవలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. డిపాజిట్లు మొదలకుని, అనేక రకాల బ్యాకింగ్ సేవలను కస్టమర్ల వినియోగించుకుంటున్నారు. సేవలు అందిస్తున్నందుకు గాను బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి.
నేటికాలం లో బ్యాంకింగ్ సేవలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. డిపాజిట్లు మొదలకుని, అనేక రకాల బ్యాంకింగ్ సేవలను కస్టమర్ల వినియోగించుకుంటున్నారు. అలానే వినియోగదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు సైతం అనేక రకాల స్కీమ్స్, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అంతేకాక తాము అందించే సేవలపై బ్యాంకులు పలు రకాల ఛార్జీలు కూడా విధిస్తుంటాయి. అయితే తాజాగా ఓ బ్యాంకుకి చెందిన కస్టమర్ల ఖాతాల్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి.. అది ఏ బ్యాంకు? ఎందుకు ఆ బ్యాంకులోని కస్టమర్ల ఖాతాలో డబ్బులు కట్ అవుతున్నాయి. ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే ప్రభుత్వ బ్యాంకుల్లో అతి ప్రధానమైన వాటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఈ బ్యాంక్ వేలాది శాఖల ద్వారా కస్టమర్లకు తమ సేవలను అందిస్తుంది. దేశంలోని గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు ఎస్బీఐ విజయవంతంగా సేవలు అందిస్తోంది. దేశ జనాభాలో ఎక్కువ మంది కస్టమర్లు కలిగిన బ్యాంక్. అంతేకాదు ఈ బ్యాంక్ పై ప్రజలకు బలమైన నమ్మకం, విశ్వాసం ఉంది. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఇది కాలక్రమేణా తమ సేవలను మార్చుకుంటోంది.
అయితే ఈ బ్యాంక్ విషయంలో ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 2వ తేదీ చాలా మంది సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. తమ ఎస్బీఐ బ్యాంక్ ఖాత నుంచి డబ్బులు కట్ అయినట్లుగా స్క్రీన్ షాట్లు పెట్టి.. వాటిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ సేవింగ్స్ అకౌంట్ల నుంచి డబ్బులు డెబిట్ అయ్యిందని కస్టమర్లు గగ్గోలు పెట్టారు. ఇంతకూ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ల నుంచి డబ్బు కట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..
మార్చి 2వ తేదీన తమ సేవింగ్ అకౌంట్ల నుంచి రూ.295 కట్ అయ్యాయని చాలామంది ఎస్బీఐ కస్టమర్లు అంటున్నారు. సాధారణంగా సర్వీస్ ఛార్జీల పేరుతో ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఖాతాల నుంచి రూ.295 కట్ చేయడానికి వేరే కారణం ఉంది. ఎన్ఏసీహెచ్ రూల్స్ కారణంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కట్ అయినట్లుగా తేలింది. సాధారణంగా ఏదైనా రుణం తీసుకున్నా, వస్తువు కొన్నా దానికి నెలవారి చెల్లింపు ఈఎంఐ కడుతుంటాం. అలా నెల వారి ఈఎంఐ కట్టడానికి నిర్ణీత తేదీ అనేది ఉంటుంది.
ఆ గడువు లోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఈఎంఐకి సరిపడే డబ్బు ఉండాలి. అలా లేని పక్షంలో బ్యాంకు వారు రూ. 250 ఫైన్ వేస్తారు. అంతేకాక దీనికి 18శాతం జీఎస్టీని కలుపుతారు. 18 శాతం జీఎస్టీ 45రూపాయలతో కలిపి మొత్తం రూ. 295 ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా నుంచి కట్ అవుతాయి. ఇలా డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ కాకుండా ఉండాలంటే నిర్ణీత ఈఎంఐ గడువుకు ఒకరోజు ముందే మీ అకౌంట్లో డబ్బు ఉండేలా చూసుకోవాలి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.