త్వరలోనే సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది.. అది కూడా వంట నూనె ధరల పెరుగదల రూపంలో. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వంట నూనె ధరలు పెరిగి సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఎందుకు అంటే..
పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే చుక్కలు చూస్తున్న సామాన్యులకు త్వరలోనే భారీ షాక్ తగలనుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గరిష్ట స్థాయికి చేరుకున్న వంట నూనె ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. కాస్త ఊపిరి పీల్చుకునే సమయంలో.. సామాన్యులకు త్వరలోనే భారీ షాక్ తగలనుంది. మరోసారి సామాన్యులపై వంట నూనె ధరల పిడుగు పడనుంది. రానున్న రోజుల్లో వంట నూనె ధరలు భారీగా పెరగనున్నాయి అంటున్నారు మార్కెట్ నిపుణులు. మన దేశంలో అధికంగా ఉపయోగించే నూనె పామాయిల్. ప్రస్తుతం మనం ఇండోనేషియా నుంచి పామ్ ఆయిల్‌ని అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో తాజాగా ఇండోనేసియా పామ్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు వినబడుతున్నాయి. అదే గనక జరిగితే భారత మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. దేశంలో వంట నూనె ధరలు మరోసారి కొండెక్కి సామాన్యులకు చుక్కలు చూపించనున్నాయి అంటున్నారు.
వంట నూనె ధరలు పెరుగుతాయనే నేపథ్యంలో దీనిపై కేంద్ర పారశ్రామిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. గత మూడు నెలల నుంచి ఇండియా భారీగా పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుందని.. ప్రస్తుతం మన దేశంలో పామాయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంగా సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. ‘‘ఇండోనేసియా ఆంక్షలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. ప్రస్తుతం మన దగ్గర ఫామాయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి’’ అని తెలిపారు.
గత ఏడాది కూడా ఇండోనేషియా ఇలానే ఒక్కసారిగా పామ్ ఆయిల్ ఎగుమతులను నిలిపివేసింది. ఈ సమయంలో భారత్ మలేసియా నుంచి ఎక్కువ మొత్తంలో పామాయిన్‌లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో దేశీయ మార్కెట్‌లో పామ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. భారత్ ప్రతి ఏటా ఇండోనేసియా నుంచి వార్షికంగా 80 వేల టన్నుల పామ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దేశంలో మొత్తం వంట నూనెల వినియోగంలో పామాయిల్ వాటా 40 శాతానికిపైగానే ఉంటుంది.
ఇలాంటి పరస్థితుల్లో ఇండోనేసియా నుంచి పామ్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోతే.. ఆ ప్రభావం వంట నూనె సరఫరాపై తీవ్రంగా ఉంటుంది. సరఫరా తగ్గితే ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండోనేసియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన దేశంలో పామ్ ఆయిల్ సహా ఇతర వంట నూనెల ధరలు 10 శాతం మేర పైకి పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి వంట నూనె ధరల పెరుగుతాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.