ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కంపెనీ షాకింగ్ అప్ డేట్ ఇచ్చింది. తొందర్లోనే ఆ కంపెనీ నుంచి ఎలక్ట్రికల్ కార్లు మార్కెట్ లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పుంజుకుంటున్న ఎలక్ట్రికల్ కార్ల రంగంలోకి సోనీ కంపెనీ రంగప్రవేశం చేయబోతోంది. ఇప్పటివరకు ఎంటర్ టైన్మెంట్ రంగంలో ఉన్న సోనీ ఇప్పుడు ఒక్కసారిగా ఈవీ కార్ల తయారీలోకి దిగబోతోంది.
Sony’s got a new company and they’re exploring a commercial launch of an EV car. Exciting times. #CES2022 #CES pic.twitter.com/JaVac2ZeDA
— Jake Krol (@Jake31Krol) January 5, 2022
ఈ విషయాన్ని సోనీ గ్రూప్ ఛైర్మన్- ప్రెసిడెంట్ కెనిచిరో యోషిదా స్వయంగా ప్రకటించారు. న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ అప్ డేట్ ఇచ్చారు. ఆ కంపెనీ పేరును ‘సోనీ మొబిలిటీ ఇన్ కార్పొరేషన్’ గా నిర్ణయించినట్లు తెలిపారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాదాపు ఏడాది వ్యవధిలోనే లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు అలా ప్రకటన చేశారో లేదో.. సోనీ కంపెనీ షేర్లు 4 శాతం పెరిగాయి. విజన్-ఎస్ -2 పేరుతో SUVల ప్రోటోటైప్ ను ప్రదర్శించారు. సోనీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.