ప్రముఖ బిజినెస్ టైకూన్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) ఇకలేరు. సోమవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో పల్లోంజీ మిస్త్రీ తుది శ్వాస విడిచారు. ఆయన నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌లో పల్లోంజీ మిస్త్రీ 18.4 శాతం వాటాతో అతి పెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు. పల్లోంజీ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.. 1929లో జన్మించిన ఆయన ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించారు. పార్సీ కుటుంబంలో జన్మించిన షాపూర్జీ 2003లో వివాహం ద్వారా ఐరిష్ పౌరసత్వాన్ని పొందారు.
కేవలం18 ఏళ్ల వయస్సులో కెరియర్ ప్రారంభించిన ఆయన క్రమంగా పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం పల్లోంజీ మిస్త్రీ భారతదేశంలోనే (2.2 లక్షల కోట్లు) ప్రపంచంలో 125వ అత్యంత ధనికుడిగా ఉన్నారు. 2021 లెక్కల ప్రకారం పల్లోంజీ మిస్త్రీ భారతదేశంలోని అత్యంత ధనికుల్లో 9వ స్థానంలో ఉన్నారు. వాణిజ్య రంగంలో పల్లోంజీ మిస్త్రీ అందించిన విశేష సేవలకుగాను 2016లో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మభూషణ్ అందుకున్నారు.
Saddened by the passing away of Shri Pallonji Mistry. He made monumental contributions to the world of commerce and industry. My condolences to his family, friends and countless well-wishers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) June 28, 2022
1865లో స్థాపించబడిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. ప్రధానంగా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోలార్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. ముంబైకి చెందిన 156 ఏళ్ల ఈ గ్రూప్ ఒక్క ఇండియాలోనే కాకుండా.. ఆఫ్రికా, మిడిలీస్ట్, దక్షిణాసియాలో నిర్మాణ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Deeply saddened on the unfortunate demise of Shri Pallonji Mistry.
His invaluable contribution to infrastructure development, commerce & industry will never be forgotten.
My condolences to his family & friends.
OM Shanti.
— Nitin Gadkari (@nitin_gadkari) June 28, 2022
పల్లోంజీ మిస్త్రీకి షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ అనే ఇద్దరు కుమారులు.. లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే 2016 అక్టోబర్‌లో మిస్త్రీ చిన్న కుమారుడు సైరస్‌ను టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించడంతో టాటా, మిస్త్రీల మధ్య వివాదం రగిలిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్ కింద మొత్తం 18 కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలో 50 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు.
Pallonji Mistry , the end of an era. One of life’s greatest joys was to have witnessed his genius , his gentleness at work. My condolences to the family and his loved ones.
— Smriti Z Irani (@smritiirani) June 28, 2022