SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై సెలవు రోజుల్లోనూ బ్యాంకు సేవలను కల్పించే ఆలోచన చేసింది. ఇందుకోసం 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. 1800 1234 లేదా 1800 2100 నెంబర్లకు ఫోన్ చేసి వినియోగదారులు తమకు అవసరమైన బ్యాంకు సేవలను పొందొచ్చు. చిన్న చిన్న పనుల కోసం బ్యాంకుల చుట్టూ అదే పనిగా తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఫోన్ ద్వారా పనులు చేయించుకోవచ్చు. ఈ నెంబర్లు ఆదివారం, ఇతర సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉంటాయి. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డు బ్లాకింగ్ స్టాటస్, కార్డ్ డిస్‌ప్యాచ్ స్టాటస్, చెక్ బుక్స్ డిస్‌ప్యాచ్ స్టాటస్, ఒక వేళ ఏటీఎం కార్డు పోయినట్లయితే కొత్త ఏటీఎం కార్డు అప్లై చేయటం వంటి వాటితో పాటు పలు రకాల సేవలను పైన పేర్కొన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయటం ద్వారా పొందొచ్చు.
ఈ మేరకు ఎస్‌బీఐ ట్విటర్‌లో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక వేళ ఈ సేవలతో మీరు సంతృప్తి పొందకపోయినా లేదా సరైనా విధంగా లబ్ధిపొందకపోయినా 8008 20 20 20కు UNHAPPY అని మెసేజ్ పంపటం ద్వారా మీ అసంతృప్తిని ఫీడ్ బ్యాక్ రూపంలో తెలియజేయోచ్చని పేర్కొంది. ఇక, ఎస్‌బీఐ తెచ్చిన ఈ టోల్ ఫ్రీ సర్వీస్ ఎంతో మంది కస్టమర్లకు ఉపయోగకరంగా మారనుంది. చిన్న చిన్న అవసరాలకోసం బ్యాంకు చుట్టూ తిరగటం తప్పుతుంది. మరి, ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన ఈ టోల్‌ఫ్రీ సర్వీసెస్ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Say goodbye to all your banking worries!
Call SBI Contact Centre toll-free at 1800 1234 OR 1800 2100.#SBI #SBIContactCentre #TollFree #PhoneBanking #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/ACJVwpqo63— State Bank of India (@TheOfficialSBI) June 26, 2022
ఇవి కూడా చదవండి : Uber: ఊబర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ అందుబాటులోకి రైడ్ షేరింగ్ సర్వీస్!