స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. SBI డెబిట్(ATM) కార్డు ఉంటే చాలు.. ఈ గుడ్ న్యూస్ మీకు వర్తిస్తుంది. డెబిట్ కార్డులపై SBI బ్యాంకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లను అందించనుంది. మీ ATM కార్డు బట్టి ఇన్సూరెన్స్ కవర్ లిమిట్ మారుతుంది. SBI కార్డులపై సుమారు రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కస్టమర్లు పొందవచ్చునట. మరో విషయమేంటంటే.. ఈ ఇన్సూరెన్స్ కవర్ కోసం కస్టమర్స్ ఎలాంటి ప్రీమియం చెల్లించే అవసరం లేదట. ఈ ఇన్సూరెన్స్ పూర్తిగా SBI కార్డు ఉన్నవారికి వర్తిస్తుంది. సామాన్యంగా SBI వీసా సిగ్నేచర్, మాస్టర్‌కార్డు డెబిట్ కార్డులపై రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంది. ఈ మొత్తాన్ని SBI కార్డు హోల్డర్ చనిపోతే, నామినీలు పొందవచ్చు. కానీ ఈ అమౌంట్ మొత్తం క్లయిమ్ చేసుకునేందుకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి.
మరి ఆ షరతులు ఏంటంటే.. ప్రమాదానికి(ఘటన) 90 రోజుల ముందు వరకు ఈ-కామర్స్, పీఓఎస్ లేదా ఏటీఎంలలో ATM కార్డును ఉపయోగించి ఉండాలి. ఒకవేళ SBI కార్డుదారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తుంది SBI బ్యాంకు. SBI తీసుకొచ్చిన ఈ ఇన్సూరెన్స్ తో పాటు కార్డు పై ప్రొటెక్షన్ కవర్ కూడా కస్టమర్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు కొన్న 90 రోజుల్లోపే కార్డు పోతే(దొంగతానికి గురైతే) ఈ కవర్ వర్తిస్తుంది. వీటితో పాటు SBI రూపే, జన్ ధన్ కార్డు ఉన్నాకూడా రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అందిస్తుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్ తెరిచిన వారికి ఈ రూపే కార్డును SBI ఆఫర్ చేస్తుంది.మరి ఇతర బ్యాంకుల కార్డుల పరిస్థితి ఏంటంటే.. SBI మాత్రమే కాకుండా చాలా బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ బ్యాంకు(డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్) రూ.50 వేల నుండి రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుండగా.. HDFC బ్యాంకు 2-10 లక్షల వరకు ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. అయితే ఈ ఫెసిలిటీస్ పై వినియోగదారులకు అవగాహన లేకపోవడం మైనస్. ఖాతాదారులకు అవగాహన కల్పించాల్సిన బ్యాంకు వారిదే అంటున్నాఋ నిపుణులు. అయితే.. ఈ ఆఫర్ వర్తించాలంటే ఖచ్చితంగా కార్డుదారులు రెగ్యులర్ గా లావాదేవీలు జరుపుతుండాలి. మరి ఈ ఇన్సూరెన్స్ ఆఫర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.