మనిషి జీవితాన్ని నడిపేది డబ్బు. బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో.. డబ్బు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఆఖరికి తినాలన్నా, తాగాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత కాలంలో చాలామందికి ఖర్చులకు సరిపడా వేతనం లభించడం లేదు. వచ్చే జీతం డబ్బులు ఇల్లు గడవడానికే సరిపోవడం లేదు. మరి అలాంటప్పుడు.. పెద్ద ఎత్తున సేవింగ్స్ అంటే కష్టమే. ఇలాంటి వారికోసం ఆర్థిక నిపుణలు చక్కని ప్లాన్ చెబుతున్నారు. రోజుకు 20 రూపాయలతో అనగా.. నెలకు 600 రూపాయలు పొదుపు చేస్తే.. రిటైర్మెంట్ కాలం నాటికి కోటీశ్వరులు కావొచ్చు అంటున్నారు. ఆ వివరాలు..
జీవితంలో భారీ ఎత్తున డబ్బు సంపాదించాలంటే.. సహనం, ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఈ రెండు మీకు ఉంటే మీరు కోటి రూపాయల కలను సాకారం చేసుకోవచ్చు. ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారనే అంశం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) SIP ఎంచుకోవడం ఉత్తమం. ఇది ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిప్ ఆప్షన్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. తక్కువ మొత్తంతోనే మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు.
రోజుకు రూ.20 పొదుపు చేస్తే చాలుమీరు పెద్ద మొత్తంలో డబ్బులు పొదుపు చేయాల్సిన పని లేదు. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. అయితే వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడాన్ని ప్రారంభించాలి. దీర్ఘకాలంలో మీరు ఈ రూ.20 పొదుపుతోనే రూ.కోటికి పైగా పొందే అవకాశం ఉంటుంది. రోజుకు రూ.20 అంటే నెలకు రూ.600 అవుతుంది. సిస్టమ్యాటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి నెలా రూ. 600ను 30 ఏళ్ల పాటు సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఇలా చేయడం అంటే కష్టమే. అయితే లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తే మాత్రం మీరు ఈ పని చేయాలి. ఓపికతో ప్రతి నెలా డబ్బులు పెడుతూ వెలితే మెచ్యూరిటీ సమయంలో రూ. కోటి 40 లక్షలకు పైగా పొందే అవకాశం ఉంటుంది.
ఇక్కడ వార్షిక రాబడి 20 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. అయితే.. మరో విషయం గమనించాలి.. మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎంత రిస్క్ ఉన్నా.. కోటీ రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి నెలకు కేవలం 600 రూపాయలు మాత్రమే కాబట్టి.. జాగ్రత్తగా సిప్‌ను ఎన్నుకుని పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. కోటీశ్వరులు అవ్వొచ్చు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Rare Currency Notes: మీ దగ్గరున్న కరెన్సీ నోటుపై ఈ సీరియల్ నెం. ఉంటే రూ.3 లక్షలు సొంతం చేసుకోవచ్చు!