యుద్ధం రెండు దేశాల మధ్యనే జరుగుతున్నా.. దాని ప్రభావం మాత్రం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా.. పలు దేశాలలో నిత్యవసర ధరలు, ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. అంతర్జాతీయంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో.. మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగాల్సి ఉంది. కానీ, దేశంలో ఇప్పటికే.. పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. రాత్రికి రాత్రే టికెట్ ధరలు పెంపు!అంతర్జాతీయంగా ఇంధనం ఎగుమతి చేసే దేశాల్లో రష్యా ఒకటి. మనకు రష్యాతో మంచి సంబంధాలు ఉండడంతో.. తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. రష్యాపై పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా.. దేశీయంగా ముడిచమురు నిల్వలు ఎక్కువవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నా.. మనకు మాత్రం ఇది శుభవార్తే. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగా ఉంటే, ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Petrol Prices world wide.. pic.twitter.com/y33b0FOlY1
— Govardhan Reddy (@gova3555) March 18, 2022
మన దాయాది దేశం పాకిస్తాన్’లో ఒక లీటర్ పెట్రోల్ 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) గా ఉంది. బంగ్లాదేశ్ లో వాహనదారులు ప్రతి లీటర్ కి $1.035(రూ.78.43) చెల్లిస్తుంటే, నేపాల్’లో ఉన్నవారు $1.226(రూ.93) చెల్లిస్తున్నారు. మన చుట్టు పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చమరు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక.. ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం “హాంగ్ కాంగ్”. ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ప్రపంచంలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశం “వెనిజులా”. ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది.
“The prices here in the U.S. are lower than many prices seen around the globe at the pump… The highest is in Hong Kong, there you see $10.72,” @juleshyman says. “A lot has to do with how gasoline… is taxed in different nations around the globe compared with here in the U.S.” pic.twitter.com/piqqx9B33y
— Yahoo Finance (@YahooFinance) March 11, 2022