రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.
రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రజలు తొలుత బ్యాంకుల్లో తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.
రూ. 2 వేల నోటు ఉపసంహణ నిర్ణయం తర్వాత బంగారం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉంది. అయినా రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి జనం నగలు షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. నిన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో కొనుగోళ్ళు అంటేనే దూరం పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయంతో మైండ్ మార్చుకున్నారు. రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ‘పాన్ కార్డు’ తప్పనిసరి.
దీంతో ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కంటే బంగారం కొనడమే మేలని భావిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన బంగారం షాపు యజమానులు రూ.2వేల నోట్లతో చేసే కొనుగోళ్లపై ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు పెరిగాయి. పెరిగిన బంగారం అమ్మకాలు, జనాల రద్దీతో వ్యాపారులు ఖుషీగా ఉన్నారు.
యూపీఐ లావాదేవీలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ వాడిన వాళ్లు కూడా ఇప్పుడు రెండు వేల నోట్ల కట్టలు పట్టుకుని బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి విషయంలో మాత్రం కేవైసీ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. దీన్నే తమకు అనుకూలంగా వ్యాపారులు మార్చుకుంటున్నారు. ఇలా రెండు వేల నోట్ల ఉపసంహరణతో బంగారం షాపుల్లో రద్దీ పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.