రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరిస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. అవేంటి.. వాటికి సమాధానాలు ఇక్కడ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2 వేల రూపాయల నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు ఐదున్నరేళ్ల క్రితం మోదీ సర్కార్ 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వాటి స్థానంలో కొత్త 500, 2 వేల రూపాయల నోట్లును విడుదల చేసింది. అయితే గత కొంత కాలంగా.. 2 వేల రూపాయల నోట్లు రద్దు ఉంటుందనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. పైగా వాటి ముద్రణ, పంపిణీ కూడా నిలిపివేశారని.. త్వరలోనే 2 వేల రూపాయల నోటు రద్దు అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని నిజం చేస్తూ సంచలన ప్రకటన చేసింది. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఆర్బీఐ 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు వీటిని మార్చుకోవాలని సూచించింది. అంతేకాక కస్టమర్లకు ఈ నోట్లు ఇవ్వ వద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఇక 2 వేల రూపాయల నోట్ల రద్దు నిర్ణయంతో అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. మరి ఈ మధ్య కాలంలో అంటే సెప్టెంబర్ 30 వరకు 2 వేల రూపాయల నోట్లు చెల్లుతాయా.. వీటిని మార్చుకోవాలంటే.. ఛార్జీలు చెల్లించాలా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమాధానాలు ఇక్కడ..
ప్రస్తుతం మార్కెట్లో అవసరమైన మేరకు కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. పైగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ఈ కారణాల వల్ల 2 వేల రూపాయల నోట్లను రద్దు చేశారు. 2018-19 ఏడాదిలోనే ఈ నోట్ల ముద్రణ ఆగిపోయినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుత్రం దేశంలో వాడుకలో ఉన్న 2 వేల రూపాయల నోట్లన్ని.. 2017 మార్చి ముందు ముద్రించినవే. ఆ తర్వాత వీటి ముద్రణ పూర్తిగా ఆగిపోయింది.
రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వాటిని మార్చుకునేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చింది. అంటే ఆ గడువు లోపు రూ. 2 వేల రూపాయల నోటు చెల్లుబాటు అవుతుంది. గడువులోపు వీటిని బ్యాంకులో మార్చుకుంటే సరిపోతుంది.
2 వేల రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు. ఆ గడువు వరకు వీటిని ప్రజలు రోజువారి సాధారణ లావాదేవీలకు వినియోగించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత మాత్రం ఇవి చెల్లవు.
2వేల రూపాయల నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ 19 బ్రాంచీల్లో కూడా వీటిని మార్చుకునే అవకాశం కల్పించారు.
బ్యాంకు ఖాతాల్లో 2 వేల రూపాయలనోట్లను డిపాజిట్ చేసుకోవడంపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి విధించిలేదు. కేవైసీ రూల్స్‌ని పాటించి.. ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు.
2 వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు గాను లిమిట్ ఉంది. ప్రజలు ఒకసారి కేవలం 20 వేల రూపాయలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది.
ఈ ఏడాది అనగా 2023, మే 23 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోట్లను మార్చుకోవచ్చు. గడవు ముగిసిన తర్వాత ఇవి చెల్లవు.
లేదు. మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌లోనే 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవాలనే నిబంధన లేదు. ఏ బ్యాంక్ బ్రాంచీలో అయినా వీటిని మార్చుకోవచ్చు. అయితే ఒక సారి ఒక బ్రాంచ్‌లో కేవలం 20 వేల రూపాయలు మాత్రమే మార్చుకునే వీలు ఉంది.
2 వేల రూపాయల నోట్లును మార్చుకునే అంశంలో.. డిపాజిట్ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. మీ దగ్గర ఎన్ని 2 వేల రూపాయల నోట్లు ఉంటే.. వాటన్నింటిని ఒకేసారి.. మీ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే 2 వేల రూపాయల నోట్లను ఇచ్చి.. ఇతర నోట్లను తీసుకునే అంశంలో మాత్రం లిమిట్ ఉంది. ఒక రోజులో 20 వేలకు మంచి ఇవ్వరు.
లేదు 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి ప్రజలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.
2 వేల రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశంలోని అన్ని బ్యాంక్‌లు వీటిని తీసుకుని.. వేరే నోట్లను ఇవ్వాలి. అలా చేయకపోతే.. ఆ బ్యాంకుల సేవల్లో లోపంగా భావిస్తారు. ఏదైనా బ్యాంక్‌లో సిబ్బంది 2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తే.. ముందుగా బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి. 30 రోజుల్లోగా దీనిపై స్పందించకపోయినా.. కస్టమర్ సంతృప్తి అయ్యే సమాధానం ఇవ్వకపోయినా.. బ్యాంక్ అంబుడ్స్ మెన్ స్కీమ్ కింద సదరు బ్యాంక్ మీద ఆర్బీఐకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.