ప్రజల్లో ఎలక్ట్రికల్ వాహనాలపై మక్కువ పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా అధికంగా వస్తుండటంతో చాలా మంది ఇ-వాహనాలకు మళ్లుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతం చాలా మంది డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకర్షితులు అవుతున్నారు. అలాగే ప్రబుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని చూస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు కూడా ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యంగా టూ వీలర్ కు మంచి డిమాండ్ లభిస్తోంది. పైగా ఇప్పుడు కొత్త టెక్నాలజీ, మంచి ఫీచర్లతో ఇ-బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా భారతదేశంలోనే తొలి ఏఐ ఎనేబుల్డ్ ఇ-బైక్ అందరినీ ఆకట్టుకుంది. కానీ. దాని బుకింగ్స్ ఆపేయడంతో అంతా నిరాశ పడ్డారు. ఇప్పుడు వారికి రివోల్ట్ కంపెనీ శుభవార్త చెప్పింది.
రివోల్ట్ మోటార్స్ కంపెనీ నుంచి దేశంలోనే తొలి ఏఐ ఎనేబుల్డ్ ఇ-బైక్ విడుదలైంది. కానీ, గతేడాది ఆ బైక్ అమ్మకాలను నిలిపివేశారు. అయితే అప్పట్లో దాని గురించి పెద్దగా ప్రచారం కూడా జరగలేదనే చెప్పాలి. ఇప్పుడు ఇ-బైక్స్ కు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో రివోల్ట్ మోటార్స్ తమ RV-400 బైక్ మళ్లీ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 23 నుంచి రివోల్ట్ ఇ-బైక్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కేవలం రూ.2,499 చెల్లించి రివోల్ట్ బైక్ బుక్ చేసుకోవచ్చు. డెలివరీ మాత్రం మార్చి నెల చివరి నాటికి అందిస్తామంటూ కంపెనీ ప్రకటించింది.
ఈ రివోల్ట్ ఆర్వీ-400 బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది ఏఐ ఎనేబుల్డ్ బైక్. ఈ బైక్ కీ లెస్, అలాగే ఇంజన్ నోట్ అనే స్పెషల్ ఫీచర్ ఉంటుంది. బైక్ లోపల స్పీకర్ల సాయంతో కృత్రిమ ఇంజిన్ సౌండ్ ని కంట్రోల్ చేస్తారు. మీకు నచ్చిన సౌండ్ ని ఎలక్ట్రిక్ బైక్ కు పెట్టుకోవచ్చు. ఫుల్ ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంటర్ క్లస్టర్, 4జీ కనెక్టివిటీ, బ్యాటరీ హెల్త్, ట్రావెల్ హిస్టరీ, నియర్ బై స్వాప్ స్టేషన్ వంటి వివరాలను రివోల్ట్ యాప్ ద్వారా పొందవచ్చు. ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజిన్ బైక్ తరహాలోనే పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ రివోల్ట్ బైక్ బ్యాటరీ ఫుల్ అయ్యేందుకు 4.5 గంటల సమయం పడుతుంది. మరి.. రివోల్ట్ ఇ-బైక్ మార్కెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Revolt RV 400 Electric Bike to Launch in 64 New Cities; Bookings to Reopen Soonhttps://t.co/nYkfwZHYQV#ElectricVehicles #swichtoelectric #gogreen #prices #pollutionfree #pollutioncheck #price #bestevinindia #evplatform #imagesofEV #LatestNews pic.twitter.com/qEwJfUHOjX
— Tride-Innovatives (@KalavathiBanoth) December 28, 2022