గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలకు దగ్గరలో తక్కువ ధరకు స్థలాలు ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్ కి కూడా చాలా దగ్గరలో ఉంది ఈ ఏరియా.
గచ్చిబౌలి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న కొల్లూరులో ల్యాండ్ రేట్లు గమనిస్తే ఇక్కడ గజం రూ. 23 వేల నుంచి రూ. 38 వేల రేంజ్ లో ఉన్నాయి. కొల్లూరులో ఎక్కువ ధర, తక్కువ ధర, యావరేజ్ ధర పలికే ఏరియాలు ఉన్నాయి. తక్కువ ధర కలిగిన ఏరియాల్లో గజం రూ. 23 వేలు, యావరేజ్ ధర కలిగిన ఏరియాల్లో గజం రూ. 30 వేలు, అధిక ధర కలిగిన ఏరియాల్లో గజం రూ. 38 వేలు ఉన్నాయి. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఏరియాలకు, అవుటర్ రింగ్ రోడ్ కి సమీపంలో ఉండడం చేత కొల్లూరు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో బూమ్ ని సృష్టించింది ఈ ప్రాంతం. హైటెక్ సిటీ నుంచి 26 కి.మీ., గచ్చిబౌలి నుంచి 15 కి.మీ., ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 12 కి.మీ. దూరంలో ఉంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నల్లగండ్ల, నానక్ రామ్ గూడ వంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఏరియాల్లో స్థలం ధరలు చాలా ఎక్కువ. అదే కొల్లూరులో అయితే రేట్లు చాలా తక్కువ. ఆ ఏరియాల్లో రేట్లు భరించలేని ఉద్యోగులు కొల్లూరులో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫలితంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ కారణంగా స్థలాల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. ప్రస్తుతం గజం రూ. 23 వేల రేంజ్ లో ఉన్నాయంటే ఇంకొన్ని రోజులకు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. కొల్లూరులో లోయెస్ట్ రేటు చూసుకుంటే చదరపు అడుగు రూ. 2500 ఉంది. 2 బీహెచ్‌కేకి సరిపడా స్థలం కొనాలనుకుంటే రూ. 25 లక్షలు అవుతుంది.
అదే 1 బీహెచ్‌కే స్థలం కావాలనుకుంటే రూ. 15 లక్షలు అవుతుంది. అదృష్టం ఉంటే దొరకచ్చు. ఈ ఏరియాలో గజం రూ. 38 వేలు చొప్పున కూడా ప్లాట్స్ ఉన్నాయి. అంటే చదరపు అడుగు రూ. 4200 ఉంది. ఈ లెక్కన 2 బీహెచ్‌కే సరిపడా స్థలం కొనాలంటే రూ. 42 లక్షలు అవుతుంది. యావరేజ్ ధర గజం రూ. 30 వేల ప్రకారం 2 బీహెచ్‌కే స్థలం కొనాలంటే రూ. 30 లక్షలు అవుతుంది. కొల్లూరులో అధిక బడ్జెట్ లోనే కాకుండా తక్కువ బడ్జెట్ లో కూడా ల్యాండ్స్ దొరుకుతున్నాయి. ఇక ఈ ఏరియాలో ఫ్లాట్స్ కొనాలంటే కనుక యావరేజ్ గా చదరపు అడుగుకి రూ. 4500 అవుతుంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్ రూ. 45 లక్షలు అవుతుంది. తక్కువ బడ్జెట్ లో అయితే 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగు రూ. 3300 చొప్పున రూ. 33 లక్షలు అవుతుంది.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.