గతంలో దేశంలో పెద్ద నోట్ల చలామణిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రూ.500, రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే పెద్ద నోట్ల చెలామణి కారణంగా నల్లదనం మరింత పెరిగిపోతుందని ఆర్థిక వేత్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్భీఐ కూడా నిజమే అని ఒప్పుకుంది.
గత కొంత కాలంగా దేశంలో రెండు వేల నోట్లు రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమే అని తేలుస్తూ.. రూ.2 వేల నోట్ల విషయంలో భారత రిజర్వ్ బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ రూ.2 వేల నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది.. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం..
భారత రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల విషయంలో సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. రూ.2 వేల నోట్లను ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సిందిగా పేర్కొంది. ఒక దఫా రూ.20 వరకు మాత్రమే మార్చుకోవాలి. ఇది ఏ బ్యాంకులో అయినా మార్చుకునే సదుపాయం ఉంది. 2016 లో ఈ నోట్ల చలామణి ప్రారంభిచగా.. ఇది నల్లదనాన్ని మరింత పెంచుతుందని ఆర్ధిక వేత్తలు విమర్శించారు. దేశంలో పెద్ద నోట్ల వినియోగం నకిలీ నోట్ల వ్యాప్తికి దారి తీస్తుందని.. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎప్పటి నుంచో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రెండు వేల నోట్లు దేశ వ్యాప్తంగా నకిలీలు తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్థిక వేత్తలే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో రూ.3.52 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణీలో ఉన్నట్లు సమాచారం. అయితే 2018 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న 2 వేల నోట్లు విలువ రూ. 6.73 లక్షల కోట్లు. ఇప్పడు 10.8 శాతం మాత్రమే మార్కెట్ లో ఉన్నాయని పేర్కొంది. ప్రజల అవసరాలకు ఇతర డినామినేషన్లలో రెండు వేల నోట్లను తగనంతగా వాడటం లేదని ఆర్బీఐ గుర్తించింది. క్లీన్ నోట్ పాలసీ లో భాగంగానే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇక పెద్ద నోట్లు చలామణిలో లేకపోవడం, ముద్రణ ఆపడం వంటి కారణాలు చెబుతున్నప్పటికీ బ్లాక్ మనీని పూర్తిగా అరికట్టడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. రాబోయే ఏడాది కాలంలో 12 రాష్ట్రలలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు విచ్చల విడిగా రూ. 2 వేల నోట్లను ఖర్చు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. జనరల్ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ మనీని అరికట్టే విషయంలో ఇది కీలక ముందడుగు అని వెల్లడించారు. అయితే.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి బ్యాంకులకు విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని వెల్లడించింది. 2016 నవంబర్ 8న కేంద్రం అప్పటి పెద్ద నోట్లను రద్దు చేసి 2 వేల నోట్లను తీసుకొచ్చింది.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023