కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి. దేశంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి ఏటా రైతులకు రూ. 6 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు. దీనికోసం వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించి.. ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది. ఇప్పటికే 12 విడతలుగా రూ.24 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 13వ విడత డబ్బులు జమ కావాల్సి ఉంది.
నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి 20 వరకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర pmkisan.gov.inలో అందుబాటులో ఉంచుతుంది. ఇక వీటికి అర్హులైన రైతులు PM కిసాన్ యోజనను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, 12వ విడత నుంచి ప్రభుత్వం e-KYC తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.