'బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న..' సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ ఇతగాడి జీవితం. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులలో లాయర్లకు, కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కోసం అర్రులు చాస్తున్నాడు.
నీరవ్ మోడీ.. గుజరాత్‌కు చెందిన ప్రసిద్ద వజ్రాల వ్యాపారి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటకు వచ్చేవరకు. ఆ తరువాత ఆర్థిక నేరగాడిగా ప్రసిద్ధిగాంచారు. ఇది భయటపడ్డాక.. ఇక్కడే ఉంటే జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందేమో అని విదేషాలకు పారిపోయాడు. పోనీ, అక్కడకి వెళ్లాక ఆనందంగా ఉన్నాడా! అంటే లేదు. భారత ప్రభుత్వం అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.ఇతగాడిని మాకు అప్పగించాలంటూ విదేశీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. అక్కడి నుండి అతడి జీవితం తలకిందులైంది. ప్రస్తుతం లండన్ జైలులో మగ్గుతున్న నీరవ్ మోడీని ఆర్థిక కష్టాలు చుట్టముట్టాయంటూ నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. మరోమారు ఇతగాడు అప్పు కోసం చేతులు చాస్తున్నాడని వినికిడి.
తాజా నివేదికల ప్రకారం.. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌డిఐపిఎల్) ఖాతాలో రూ. 236 మాత్రమే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ కథనాన్ని నివేదించింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన బకాయిలకుగాను.. అతని కంపెనీ ఖాతా నుంచి రూ.2.46 కోట్లను కోటక్ మహీంద్రా బ్యాంకు ఎస్‌బీఐకి బదిలీ చేసింది. పలితంగా అతని ఖాతాలో వెయ్యి రూపాయలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు సైతం మొత్తం బకాయిల్లో కొంత మొత్తాన్ని ఆదాయపుపన్ను కింద ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసినట్లు నివేదిక పేర్కొంది.
కాగా, గతవారం భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని నీరవ్‌ను కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు నీరవ్ మోడీ తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. మరి విచారణ నిమిత్తం చెల్లించాల్సిన చట్టపరమైన ఖర్చుల్ని ఎలా చెల్లిస్తారంటూ కోర్టు అతడిని ప్రశ్నించగా, భారత్ తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున, డబ్బు చెల్లించే మరో మార్గం కనిపించడం లేదని తెలిపాడు. త్వరలోనే ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానని, రుణ దాత కోసం అన్వేషిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించాడు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం, అందుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు సిబిఐ విచారణకు సంబంధించిన ఆధారాలను మరియు సాక్ష్యులను ప్రభావితం చేయడం వంటి 3 కేసులు అతని మీద ఇండియాలో నమోదై ఉన్నాయి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fugitive Nirav Modi’s company has only Rs. 236 in Bank account.
Read more: https://t.co/PI34yM7KAv #NiravModi #PNB #TBReports pic.twitter.com/8H6qtWGMr1
— The Brands (@thebrandsindia) March 19, 2023