ట్విట్టర్ బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ కార్యాలయాల మూసివేతకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారత్ లోని రెండు ట్విట్టర్ ఆఫీస్‌లు మూసివేయాల్సిందిగా ఆదేశించారని సమాచారం.
ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నాక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగుల తొలగింపుపై ఫోకస్ పెట్టిన మస్క్, ఇప్పుడు ట్విట్టర్ కార్యాలయాల మూసివేతపై ద్రుష్టి సారించాడు. ఖర్చుల తగ్గింపే ప్రధాన లక్ష్యంగా కార్యాలయాల మూసివేతకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారత్‌లోని మూడు ట్విట్టర్ ఆఫీస్‌ల్లో రెండింటిని మూసివేయాల్సిందిగా ఆదేశించారని సమాచారం. ఇది వాస్తవమే అయితే.. ఢిల్లీ, ముంబై నగరాలలోని ట్విట్టర్ కార్యాలయాలు మూతపడనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ట్విట్టర్ కార్యాలయాలు దేశంలో మూడు చోట్ల ఉన్నాయి. బెంగుళూరులోని ప్రధాన కార్యాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. దీంతో ఈ రెండు రెండింటిని మూసివేయాల్సిందిగా మస్క్ ఆదేశించారట. కాగా ఢిల్లీ, ముంబైల్లోని ఆఫీస్‌లు కేంద్రంగా ఇంతకాలం పనిచేసిన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగించాలని ట్విట్టర్ కోరిందని సమాచారం. అయితే, ట్విటర్ కార్యాలయాల మూసివేత ఒక్క భారత్‌లోనే కాదని, ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఆఫీస్‌లను ట్విటర్ మూసివేస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి.
ట్విట్టర్‌ను లాభాల బాటలోకి నడిపించడమే ఎలాన్ మస్క్ ప్రధాన ఎజెండా అని తెలుస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టారని సమాచారం. ట్విట్టర్ లో గతేడాది 2022 నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగుల ఏరివేత జరిగింది. ఒక్క భారత్‌లోనే 90 శాతం ఉద్యోగులను తొలగించినట్టు ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కంపెనీ కార్యకలాపాలు సవ్యంగా కొనసాగాలంటే ఆర్థికంగా బలోపేతమవ్వడం చాలా ముఖ్యమని మస్క్ భావిస్తున్నారట. అందుకే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
#ElonMusk shuts two of three #Twitter India offices, sends staff home
The company continues to operate an office in the southern tech hub of Bengaluru that mostly houses engineers.https://t.co/nLnUH37B3A
— The Times Of India (@timesofindia) February 17, 2023