బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది. బ్యాంకుల పనిదినాల్లో, పనివేళల్లో మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకులు వారంలో 6 రోజులు పాటు తెరిచి ఉంటున్నా, రాబోవు రోజుల్లో అది ఐదు రోజులకే పరిమితం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి త్వరలోనే కీలక ప్రకటన వెలుబడనట్లు సమాచారం.
బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది. త్వరలోనే బ్యాంకుల పనిదినాల్లో, పనివేళల్లో మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకులు వారంలో 6 రోజులు పాటు తెరిచి ఉంటున్నా, రాబోవు రోజుల్లో అది ఐదు రోజులకే పరిమితం కానుంది. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలోనే కీలక ప్రకటన వెలుబడనట్లు సమాచారం అందుతోంది. ఇది బ్యాంకు ఉద్యోగులకు ఆనందాన్ని పంచె విషయం కాగా, ఖాతాదారులకు చేదు వార్త.
వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంక్ యూనియన్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తేలింసిందే. బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టడం, వారిని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చర్చలకు పిలవడం.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న తంతు. త్వరలోనే ఈ విషయం ఓ కొలిక్కి రానుందట. తాజాగా బ్యాంకు యూనియన్లకు, ప్రభుత్వానికి మధ్య ఈ విషయపై చర్చలు జరగగా, ఐబీఏ సానుకూలంగా స్పందించిందని సమాచారం. అదే జరిగితే బ్యాంకు సిబ్బందికి వారంలో రెండు వీక్లీ ఆఫ్స్ అమలవుతాయి. ఇందుకు గాను బ్యాంకు సిబ్బంది మిగిలిన ఐదు రోజుల పనిదినాల్లో ప్రతిరోజూ 50 నిమిషాల పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రమెంట్స్ యాక్ట్, సెక్షన్ 25 ప్రకారం అన్ని శనివారాలను సెలవుదినాలుగా ప్రభుత్వం నోటిఫై చేయనుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి నెలలోని రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవుల విధానం అమలవుతోంది. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలులోకి వస్తే.. బ్యాంకులు శని, ఆదివారాలు పూర్తిగా మూతపడునున్నాయి. కాగా, అప్పుడు బ్యాంకు పనివేళలు ఉదయం 9.45 నుంచి 5.30 వరకు పొడిగిస్తారని చెబుతున్నారు. దీనిపై.. త్వరలోనే కీలక ప్రకటన రానుంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Bank Employees Soon To Get 2 Days Weekly Off, IBA Considering Proposal: Reports#WorkWeek #Banks https://t.co/thB5fOxHA7
— India.com (@indiacom) March 1, 2023