అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. తన ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు తరలించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైనాతో రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్ విజృంభణ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్ కారణంగా.. యాపిల్ ఉత్పత్తుల తయారీని నిలిపివేయాలని భావిస్తోందని సమాచారం. 2025 కల్లా.. Mac, iPad, Apple Watch, Airpods వంటి యాపిల్ ఉత్పత్తుల్లో 25 శాతం వరకైనా చైనా బయట తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుందట. అందుకు ఇండియానే ప్రత్యామ్నాయం అని భావిస్తోందట.
ఇప్పటికే.. యాపిల్ ఐఫోన్ల తయారీని ఇండియాలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపాడ్‌ల తయారీని కూడా భారత్ లో మొదలుపెట్టాలని యోచిస్తోందట. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. అదే జరిగితే.. డ్రాగన్ పెత్తనానికి చెక్ పెట్టినట్లే. చైనా నుంచి తన తయారీ కేంద్రాన్ని తరలించడానికి ముఖ్య కారణం.. అక్కడి ఝెంగ్జూ నగరం. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే యాపిల్ మార్కెట్ లో 70 శాతం అక్కడే తయారవుతాయి. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అములుచేస్తోంది అక్కడి ప్రభుత్వం.
ఇదే క్రమంలో ఝెంగ్జూలోని యాపిల్ తయారీ ఫ్యాక్టరీ(ఫాక్స్‌కాన్) కూడా మూతపడింది. భవిష్యత్ లో ఇలాంటి బాధలు లేకుండా ఉండాలంటే.. ఇండియాకు తరలించడమే సరైన నిర్ణయంగా ఆలోచిస్తుందట. అందులోనూ.. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా వుంటుంది. ఇది కూడా ఒక కారణమే. మరోవైపు.. ఇండియాలో ఐఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫ్యాక్టరీని రూ.5 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశీయంగా ఐఫోన్లను తయారు చేయనున్న తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్ నిలుస్తుంది. అంతేకాదు.. వాటి యాపిల్ బ్రాండ్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
Apple Said to Be Exploring Moving Some iPad Production to India From China – Newsworldpress @ https://t.co/Q2rwjtKlGh pic.twitter.com/bomOBTr5Jn
— newsworldpress.com (@newsworldpress) December 6, 2022