ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హిండెన్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో లక్షల కోట్ల సంపదను నష్టపోయినా, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. వేల కోట్ల రుణాలను గడువుకు ముందే చెల్లిస్తూ.. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపుతున్నారు. తాజగా, రూ. 21వేల కోట్లకుపైగా అప్పులను రెండు వారాల ముందే చెల్లించి వార్తల్లో నిలిచారు.
అదానీ, అదానీ సంస్థలపై అమెరికన్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఆరోపణలు అందరకీ విదితమే. అదానీ గ్రూప్ అవకతవలకు పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్ వదిలిన ఒక రిపోర్ట్, లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. కొద్ది రోజుల క్రితం 160 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 2వ స్థానంలో నిలిచిన అదానీ, ప్రస్తుతం 21వ స్థానంలో ఉన్నారు. దాదాపు వంద బిలియన్ డాలర్ల సంపదను అదానీ గ్రూప్ నష్టపోయింది. ఈ పతనానికి నాథన్ ఆండర్సన్ ఆధ్వర్యంలోని హిండెన్ బర్గ్ నివేదికలు ప్రధాన కారణం. అయినప్పటికీ, అదానీ ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. వేల కోట్ల అప్పులను గడువుకు ముందే చెల్లిస్తూ ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపుతున్నారు.
లక్షల కోట్ల సంపద కోల్పయినా గౌతమ్ అదానీ ఏమాత్రం సడలడం లేదు. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాలను గడువుకు ముందే చెల్లిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి(మార్చి 31) చెల్లించాల్సిన రూ. 21 వేల కోట్లకు పైగా అప్పును రెండు వారాల ముందే తీర్చేసింది. ఈ మేరకు అదానీ గ్రూప్ ప్రకటన చేసింది. గ్రూప్ షేర్లను కుదవబెట్టి మార్జిన్ లింక్డ్ షేర్ బ్యాక్డ్ ఫైనాన్సింగ్ నుంచి తీసుకున్న 2.15 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 17,630 కోట్లు)తో పాటు అంబుజా సిమెంట్స్ కోసం తీసుకున్న 500 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 4,100 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ రుణాల తిరిగి చెల్లింపునకు 2023 మార్చి 31 నాటి వరకు గడువు ఉంది.
ఈక్విటీ ఆధారిత అప్పుల ముందస్తు చెల్లింపుల్లో భాగంగా $2.15 బిలియన్ల రుణాలను, అంబుజా సిమెంట్స్ కొనుగోలు కోసం తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాలను రెండువారాల గడువు లోపే చెల్లించామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ చెల్లింపులు అదానీ గ్రూప్ నగదు నిర్వహణ వ్యవస్థల పటిష్టతను ప్రతిబింబిస్తోందని వెల్లడించింది. కాగా, హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనంతరం అదానీ షేర్లు పతనమై లక్షల కోట్ల సంపద కోల్పోయాక.. అదానీ గ్రూప్‌కు రీఫైనాన్సింగ్ చేసేందుకు చాలా బ్యాంకులు వెనుకంజ వేసినట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక కథనాన్ని నివేదించింది. ఈ నేపథ్యంలోనే అదానీ వేల కోట్ల అప్పులను ముందస్తుగా చెల్లిస్తూ.. నివేదికలను తేటతెల్లం చేస్తున్నారు. ప్రస్తుతానికి అదానీ సంపద 56.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adani Group prepays $2.2 billion worth share-backed loans https://t.co/EYQZtbhUgI via @ET_Infra @gautam_adani | @AdaniOnline pic.twitter.com/WMZq8JgoUV
— ETInfra (@ET_Infra) March 13, 2023