ప్రేమికుల రోజును(ఫిబ్రవరి 14) పునస్కరించుకొని రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వ్యాలెంటైన్స్ డే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా రీచార్జ్ చేసే కస్టమర్లకు అడిషనల్ డేటా ప్రయోజనాలు, విమాన టికెట్ బుకింగ్స్ పై భారీ తగ్గింపులు, ఉచిత బర్గర్‌తో వంటి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. ప్రేమికుల రోజును(ఫిబ్రవరి 14) పునస్కరించుకొని ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వ్యాలెంటైన్స్ డే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా రీచార్జ్ చేసే కస్టమర్లకు అడిషనల్ డేటా ప్రయోజనాలు, విమాన టికెట్ బుకింగ్స్ పై భారీ తగ్గింపులు, ఉచిత బర్గర్‌తో వంటి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జియో అందిస్తోన్న వాలంటైన్స్ డే ఆఫర్లు ఏంటి..? వాటి వల్ల అందే ప్రయోజనాలు ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
జియో వాలెంటైన్స్ డే ఆఫర్ 2023 బెనిఫిట్స్:
వాలెంటైన్స్ డే సంధర్బంగా జియో రూ. 349, రూ. 899, రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. రూ. 349, రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 12 జీబీ డేటా, రూ. 2,999 ప్లాన్‌పై 87 జీబీ డేటా అదనంగా అందిస్తోంది. అలాగే.. ఇక్సిగో రూ.4,500 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న విమాన టికెట్ బుకింగ్స్ పై రూ.750 విలువైన ఓచర్ ఉచితంగా లభిస్తుంది. ఇక ఫెర్న్స్ అండ్ పెటల్స్ పై రూ.799 విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి రూ.150 వరకు తగ్గింపు పొందే వీలుంటుంది. వీటితో పాటు మెక్‌డొనాల్డ్స్ లో ప్రతి రూ.199 కొనుగోలుపై ఉచితంగా బర్గర్ ఓచర్ అందిస్తోంది.
రూ. 349 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ప్రతిరోజు 2.5జీబీ డేటా చొప్పున 30 రోజులకుగానూ 75జీబీ డేటా పొందుతారు. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. వీటితో పాటు అన్ని జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉచితం.
రూ. 899 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ప్రతి రోజూ 2.5జీబీ డేటా చొప్పున 90 రోజులకు 225జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. వీటితో పాటు అన్ని జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉచితం.
రూ. 2,999 ప్లాన్:
ఇదొక వార్షిక ప్లాన్.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 388 (365 డేస్+ 23 డేస్) రోజులు. ప్రతి రోజూ 2.5జీబీ డేటా చొప్పున 388 రోజులకు 912.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే.. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. వీటితో పాటు అన్ని జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉచితం.
గమనిక: జియో కస్టమర్లు MyJio యాప్ ద్వారా రీఛార్ట్ చేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్రత్యేక ప్లాన్ల ద్వారా రీఛార్జ్ చేసిన వెంటనే అదనపు డేటా తక్షణమే యాడ్ అవుతుంది. 72 గంటల్లో ఓచర్లు లభిస్తాయి. వీటిని 30 రోజుల్లో రిదీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.