ప్రారంభంలో అన్నీ ‘ఫ్రీ’ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది. అయితే.. ఈ మధ్య కాలంలో జియో ఏదో ఒక పేరు చెప్పి రీఛార్జ్ ధరలను పెంచుతూపోతోంది. ఈ క్రమంలో యూజర్లు కూడా కొద్దికొద్దిగా సంస్థను వీడుతున్నారు. దీంతో.. యూజర్లను మళ్లీ ఎలాగోలా గాడిలో పెట్టాలనుకుంటున్న జియో చిన్న చిన్న ఆఫర్లు ప్రకటిస్తూ యూజర్లను మభ్యపెడుతోంది.
భారీ వర్షాలతో అతులాకుతలమైన అసోం & నార్త్ ఈస్ట్‌లోని యూజర్లకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడి జియో యూజర్లకు నాలుగు రోజుల పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5GB డేటా, 100 SMSలు పొందవచ్చు. ఈ ప్లాన్‌కు అర్హులైన ప్రతి ఒక్కరికీ జియో.. ఎస్ఎంఎస్ పంపుతోంది. అసోంలోని దిమా హసావో, కర్బీ అంగ్లాంగ్ ఈస్ట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, హోజాయ్ కాచార్ ప్రభావిత జిల్లాల్లో ఉన్న జియో యూజర్లు ఈ జియో అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
The new 4 days unlimited calling plan is eligible to customers living in the Assam and Northeast region. Places like Karbi Anglong East, Dima Hasao, Karbi Anglong West, Cachar in Assam and Hojai- will be liable to avail of the benefits from Jio.#assam #jio
— goodmorningsilchar (@gmsilchar) May 20, 2022
ఇది కూడా చదవండి: TRAI: ఇకపై కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా.. ఎవరు చేశారో తెలిసిపోతుంది!
వర్షాల కారణంగా అసోం & నార్త్ ఈస్ట్‌లోని పలు ప్రాంతాల్లో జియో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. ‘మీ నంబర్‌కి కాంప్లిమెంటరీ 4-Day అన్ లిమిటెడ్ ప్లాన్ అందిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో జియో నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జియో యూజర్లు ఇతర ప్రాంతాలలో ప్రయాణ పరిమితుల కారణంగా రీఛార్జ్‌లు చేసుకోలేరు. ఈ ప్లాన్ జియో బాధిత కస్టమర్లకు సకాలంలో సర్వీసులను అందించేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు’ జియో సంస్థ తెలిపింది.